ఆకేపాటికి జగన్ హామీ

201

వైసీపలో – టీడీపీలో ఇప్పుడు సీట్ల రచ్చకడప జిల్లాలో జరుగుతోంది.. ఓ పక్క మైదుకూరు మరో పక్క జమ్మలమడుగు వివాదం టీడీపీని షేక్ చేస్తుంటే, వైసీపీలో కొత్త చేరికలు నాయకులకు సీట్లు వస్తాయా అసలు టికెట్ వచ్చే అవకాశం ఉందా అనే ఉత్కంఠను కలిగిస్తున్నాయి… రాజంపేట వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆకేపాటి అమరనాధరెడ్డి గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఈ పర్యాయం ఎలాగైనా గెలవాలని ఆయన మొదటి నుంచి పావులు కదుపుతున్నారు. పార్టీని ఇక్కడ అంటిపెట్టుకుని ఉన్నారు.

Image result for ఆకేపాటి అమరనాధరెడ్డి
ఈ నేపధ్యంలో గురువారం ఆకేపాటి హైదరాబాదులో జగన్ను కలవడం చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య అంతర్గతంగా చర్చలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది. అనంతరం ఆకేపాటి మీడియాతో మాట్లాడుతూ ఇంతవరకు రాజంపేట వైసీపీ టికెట్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వైసీపీలో తాను కూడా ఫౌండర్నే అని హైకమాండ్, పార్టీ అధినేత జగన్ ఎలా నడుచుకోమంటే అలా నడుచుకుంటామని అన్నారు. అయితే జగన్ ఆకేపాటికి హామీ ఇచ్చారని మేడా కుటుంబానికి ఎంపీ టికెట్ ఇస్తారు అని తెలుస్తోంది.