అసెంబ్లీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్ షాకైన చంద్రబాబు

93

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 9వ రోజు ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాల్లో ఫీజు రీయింబర్స్మెంట్, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, 45 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్, పంచాయతీరాజ్ శాఖలో నిలిచిపోయిన పనులపై టీడీపీ సభ్యుల ప్రశ్నలు అడగ్గా.. సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా అమ్మఒడి పథకం అమలు, ఉద్యోగాల భర్తీ.. పరవాడ కాలుష్యంపై వైసీపీ సభ్యులు మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే.. ఎక్సైజ్ చట్టంలో సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును మంత్రి నారాయణస్వామి సభలో ప్రవేశపెట్టనున్నారు.

Image result for ap assembly speaker in amaravathi in 2019

45 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్.. పంచాయతీరాజ్ శాఖలో నిలిచిపోయిన పనులపై టీడీపీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అమ్మఒడి పథకం అమలు, ఉద్యోగాల భర్తీ.. పరవాడ కాలుష్యంపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. ఏపీ అసెంబ్లీలో తొలి సస్పెన్షన్ నేడు జరిగింది. సభ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు.

Image result for ap assembly speaker in amaravathi in 2019

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ను మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే ఉండి నినాదాలు చేస్తున్నారు. అయితే వారిని సభా సమావేశాలు ముగిసే వరకూ కాకుండా సభా సంప్రదాయాలు పాటించని వారిని శాశ్వతంగా బహిష్కరించాలని చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయంగా ఏపీలో చూస్తే.

అందరికి షేర్ చేయిండి

ఏపీ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో టీడీపీ బలం 23కు పడిపోయింది. కానీ వీరిలో చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. నేతలంతా ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. కానీ ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే.. ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. టీడీపీ తరఫున గళం విప్పి, అధికార పక్షానికి ధీటుగా సమాధానం ఇస్తోంది కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే. చంద్రబాబు కాకుండా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రామానాయుడు మాత్రమే మాట్లాడుతున్నారు. పయ్యావులకేశవ్, కరణం బలరాం, వెలగపూడి రామకృష్ణబాబు, గద్దెరామ్మోహన్, వల్లభనేని వంశీ లాంటి నేతలు ఉన్నప్పటికీ వారెవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలా చంద్రబాబు వెంట నేతలు ఎవరూ ఉండకపోవడం అలాగే మాట్లాడే ముగ్గురు నేతలపై సస్పెన్షన్ వేటు వేయడంతో టీడీపీ అధినేత డైలమాలో ఉన్నారు.