అసెంబ్లీలో రాజుగారు పంచ్

351

ఏపీలో ఓ పక్క బంద్ జరుగుతోంది, అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి రావడంపై ఛలోక్తి విసిరారు. ఆనాడు అసెంబ్లీలో రామారావు గారు పసుపు జెండా పట్టుకుంటే ఈనాడు ఉన్న ఈ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, సభ్యులందరూ కూడా నల్ల డ్రస్సులేసుకుని ఆ పసుపుకు అన్యాయం చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.

mla vishnu kumar raju satires on cm chandrababu naidu, bjp

ఇక మంత్రి యనమల రామకృష్ణుడు నల్ల చొక్కా ధరించలేదని ఆయన మనస్సాక్షికి రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేయలేదని తెలుసని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు.ఇక ఈసమయంలో సీఎం చంద్రబాబు కూడా ఆయనపై ఫైర్ అయ్యారు.. కేంద్రం అన్యాయం చేస్తోంది మీరు వారికి ఊడిగం చేస్తున్నారు అని బీజేపీ నేతలపై ఆయన విమర్శించారు.