అవిశ్వాసం వీగిపోయినా బాబు గెలిచేనా..!

575

తెలుగుదేశం పార్టీ గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఆ తీర్మానం వీగిపోవడం తెలిసిందే…అయితే అవిశ్వాసం వీగిపోయినా బాబు తెలుగుదేశం నేతలు సంతోషంగానే ఉన్నారని సమాచారం..మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అవిశ్వాసం పెట్టలేదు..లక్ష్యం అదే అయినా సాధ్యం కాలేదు… ఈ విషయం బాబుకు తెలుసు కాబట్టి కేంద్రాన్ని దేశం ముందు దోషిగా నిలబెట్టేందుకు, ఎండగట్టేందుకు అవిశ్వాసం పెట్టామన్నారు. కాని చంద్రబాబు అనుకున్నదేదీ జరగలేదు.

ఎపి కి ప్రత్యెక హోదా ఇవ్వాలనే ప్రధాన డిమాండు ను హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోడీ తిరస్కరించగా కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదు..రాహుల్ గాంధి ప్రధాని కాగానే ఎపి ప్రత్యెక హోదా పై తోలి సంతకం పెడతారని ఏపి కాంగ్రెస్ నేతలు ఊదరగోడుతున్నప్పటికీ రాహుల్ పట్టించుకున్నట్టు కనబడడం లేదు..ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని అర్థమైంది. అవిశ్వాసం సారాంశం ఏమిటంటే చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నాడని మోదీ ఆరోపించారు. మోదీయే యూటర్న్‌ తీసుకున్నారని, తాను కాదని బాబు ఆరోపించారు. మరి ఇందులో సంతోషకరమైన విషయమేముంది?

పదిహేనేళ్ల తరువాత టీడీపీ మాత్రమే అవిశ్వాసం పెట్టగలిగిందని, ఇది ఘన విజయమని బాబు, తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. నియంతవంటి మోదీపై అవిశ్వాసం పెట్టడమంటే మాటలు కాదు కదా అన్నది వీరి అభిప్రాయం. మోదీని ధైర్యంగా ఢీకొంటున్నది బాబే కాబట్టి ఇది ఆయన విజయమంటున్నారు. అందులోనూ జాతీయపార్టీ ప్రభుత్వంపై ప్రాంతీయ పార్టీ అవిశ్వాసం పెట్టడం గొప్పేనంటున్నారు. వైకాపా ఎంపీలు సభలో లేకపోవడంతో వారిని దుయ్యబట్టే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది.

ఏ ఘటనైనా తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం బాబుకు తెలిసిన విద్య. ఇప్పుడూ దాన్నే ప్రదర్శిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం వేడిని చల్లారనివ్వకుండా పోరాడుతూనే ఉంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రత్యేకహోదా వచ్చేదాకా వదలరట! ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకూ పోరాటం చేస్తూనేవుంటామన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తాజా అవిశ్వాసం వరకు 20సార్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టారు.

ఎక్కువ అవిశ్వాలు ఇందిరాగాంధీ ప్రభుత్వాలపై పెట్టారు. ఆమె 15సార్లు ఈ తీర్మానాలు ఎదుర్కొన్నారు. లాల్‌బహదూర్‌ శాస్త్రి, పీవీ నరసింహారావు మూడుసార్లు చొప్పున, మొరార్జీ దేశాయ్‌ రెండుసార్లు, నెహ్రూ, రాజీవ్‌ గాంధీ, అటల్‌బిహారీ వాజ్‌పేయి ఒక్కోసారి అవిశ్వాసం ఎదుర్కొన్నారు. 1979లో మొరార్జీ దేశాయ్‌ సభలో చర్చ జరుగుతుండగానే రాజీనామా చేశారు. మిగతా అన్ని తీర్మానాలు వీగిపోయాయి.