అలర్ట్ వైయస్ జగన్ ఇంటి సమీపంలో పేలుడు

212

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి సమీపంలో పేలుడు ఘటన కలకలంరేపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చకు దారి తీసింది.. అసలు ఇలాంటి పేలుడు వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే రీతిన పోలీసులు ఆరా తీస్తున్నారు..తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. సీఎం నివాసానికి సమీపంలోని ఓ ఇంట్లో ఈ పేలుడు సంభవించింది. దీంతో ఇల్లు పై కప్పుతో సహా గోడలన్నీ ఎగిరిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న పింకీ అనే యువతికి తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో యువతి కంటి చూపు పోయింది.

పేలుడు దెబ్బకు చుట్టుపక్కల ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. ముఖ్యమంత్రి జగన్ ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉలిక్కిపడ్డారు. ఘటనపై ఆరా తీసి తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందని పోలీసులు చెబుతున్నారు. ఆ ఇంట్లో బాణసంచా తయారు చేస్తున్నట్లు గుర్తించారు.. ఆ టపాసులు పేలి తర్వాత గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందంటున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఈ ఇంట్లో బాపట్ల శివశంకర్‌.. తన భార్య, ముగ్గురు కుమార్తెలతో నివాసం ఉంటున్నారు. శివశంకర్‌ తాపీ పని చేస్తుండగా.. ఇంట్లో కుటుంబసభ్యులు నేల టపాకాయలు తయారు చేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారట. శివశంకర్‌కు భార్యకు గొడవలు జరుగుతున్నాయి.. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి టపాకాయల్ని తయారు చేసే బాధ్యత రెండో కూతురు పింకీ చూస్తోంది. తండ్రి పనికి వెళ్లిన తర్వాత టపాకాయలు తయారు చేస్తుండగా ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే ఇదేనా మరేమైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రుల నివాసాల దగ్గర ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి, ఈ విషయం తెలిసి వైసీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డారు. అయితే దిపావళి వస్తున్న సందర్గంగా మరో రెండు నెలల్లో టపాకాయలకు మార్కెట్ ఉంటుంది. అందుకే పెద్ద ఎత్తున ఇళ్లలో దీపావళి సామాన్లు తయారు చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంట్లో మందుగొండు సామాగ్రి తయారు చేయకూడదు అని చెబుతున్నారు పోలీసులు, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.