అనిల్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన జనసేనాని

248

నెల్లూరు జిల్లాలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రాచారంలో పాల్గొన్నారు… ఈ సమయంలో ఇక్కడ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్ది అనిల్ కుమార్ యాదవ్కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేనాని. మంచి నాయకులని ఈసారి ఎన్నుకోవాలి మంచి అభ్యర్దులను జనసేన నిలబెడుతోంది అని తెలియచేశారు పవన్ కల్యాణ్.. ఈ సమయంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ ప్రస్తావన తెచ్చారు. అనీల్ కుమార్ యాదవ్ నా అభిమాని అని చెప్తాడు. రెండు మూడు సార్లు కలిశాడు.

Image result for anil kumar yadav

నువ్వు బెట్టింగులు మానేసి.. నా అభిమాని అని చెప్పు అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే ఇలా ప్రజాప్రతినిధులు పేకాటలు బెట్టింగులు ఆడితే బయటవారు ఎవరైనా దొరికితే ఎలాంటి పరిస్దితి ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి అని పవన్ తెలియచేశారు.. ఇక్కడకు నన్ను కొందరు తెలుగుదేశం నాయకులు మంత్రి నారాయణ గతంలో రాకుండా అడ్డుకున్నారు అని, నెల్లూరులో తన అభిమానులు తన సొంత మనుషులు చాలా మంది ఉన్నారు అని ఈ విషయం మర్చిపోవద్దు అని చెప్పారు పవన్ కల్యాణ్.