అనంతలో సైకిల్ దిగిన మాజీ ఎమ్మెల్సీ

140

అనంతపురం జిల్లాలో వరుసగా తెలుగుదేశం పార్టీకి షాక్ లు తగుతున్నాయి.. ఈ సమయంలో వైసీపీలో కొందరు నాయకులు క్రీయాశీలకంగా పావులు కదుపుతున్నారు.. తెలుగుదేశం నేతలు కొందరు వైసీపీ నేతల వెంట నడుస్తున్నారు. అయితే పార్టీలో ఉండాలి అని ఎంత చెబుతున్నా కొందరు మాత్రం వినిపించుకోవడం లేదు. వైసీపీ వైపు పరుగులు పెడుతున్నారు. మరి ఇప్పుడు ఇలాంటి సీన్ ఇక్కడ మరో సెగ్మెంట్లో జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఆయనకు పేరు ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్సీ గా కూడా ఆయన ఉన్నారు.. టీడీపీ నేత మెట్టు గోవిందరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. గోవిందరెడ్డితో కాల్వ శ్రీనివాసులు, ఎంపీ జేసీ దివాకర్రెడ్డి చర్చలు విఫలమయ్యాయి. పలువురు వైసీపీ నేతలు మెట్ట ఇంటికి చేరుకున్నారు. ఇక ఆయన వైసీపీలో చేరడం పక్కా అని పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.