అక్క‌కోసం త‌మ్ముళ్లు వ‌స్తారా అభిమానులు ఆశ‌లు?

247

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూక‌ట్ ప‌ల్లి సీటు పై మ‌రింత ఫోక‌స్ చేసింది. ఇక్క‌డ ప్ర‌చారంలో నంద‌మూరి సుహాసిని ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ పెద్ద ఎత్తున ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. అయితే కూక‌ట్ పల్లిలో ఇప్పుడు నంద‌మూరి కుటుంబం నుంచి ఎవ‌రైనా ప్ర‌చారానికి వ‌స్తారా లేదా అనే డైల‌మా అయితే ఏర్ప‌డింది.. దీనికి కార‌ణం నంద‌మూరి సుహాసినికి స‌పోర్ట్ గా తెలంగాణ తెలుగుదేశం నేతలు ఏపీ మంత్రులు బాల‌య్య ఎంపీలు మిన‌హా ఎవ‌రూ ప్ర‌చారానికి రావ‌డం లేదు.

Related image

అయితే అక్క‌ను దీవించండి అని ప్ర‌క‌ట‌న‌తో వ‌దిలేస్తారా అనే అనుమానం కూడా ఇప్పుడు క‌లుగుతోంది నందూరి తార‌క్ క‌ల్యాణ్ రామ్ మౌనంతో.. ముఖ్యంగా రాజ‌కీయంగా ఎన్టీఆర్ గ‌తంలో ప్ర‌చారం కూడా చేశారు 2009 ఎన్నికల్లో.. మ‌రి ఈసారి అక్క‌కోసం కూక‌ట్ ప‌ల్లి ప్ర‌చారానికి వ‌స్తారా లేదా ఓ ట్వీట్ తో స‌రిపెడ‌తారా అనేది నంద‌మూరి అభిమానుల్లో కూడా పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది.. తమ సోదరి నందమూరి సుహాసిని ఘన విజయం సాధించాలని కోరుకుంటూ తారక్, కల్యాణ్ రామ్ ప్రెస్ నోట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.