అందుకే పార్టీ మారాను వైసీపీ ఎమ్మెల్యే

387

ఏపీలో ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో వైసీపీ టీడీపీ మ‌ధ్య వార్ ముదిరింది అనే చెప్పాలి…ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ముడుపులు తీసుకొని పార్టీ మారావంటూ అసత్య ఆరోపణలు చేయడం కాదని, దమ్మూ, ధైర్యం ఉంటే ముడుపులు తీసుకున్నట్లు రుజువుచేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుజువు చేయలేని పక్షంలో ఎమ్మెల్సీ పదవికి గోవిందరెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే జయరాములు సవాలు చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో ఎమ్మెల్యే విలేఖరుల సమావేశం నిర్వహించారు.

Image result for ycp

ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారితే ముడుపులు తీసుకొని పార్టీ మారారంటూ ఎమ్మెల్సీ దిగజారుడు తనానికి నిదర్శనమని, దళిత ఎమ్మెల్యేనని చులకన భావంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదనను వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో ప్రజల ఆదరాభిమానాలతో గెలిచానని, తనకు రాజకీయ బిక్షపెట్టింది గోవిందరెడ్డి అయినప్పటికీ, నన్ను అణగదొక్కాలని చూశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా 2సంవత్సరాలు పదవీకాలం పూర్తికాకుండానే మరో వ్యక్తిని తీసుకువచ్చి పార్టీ అభ్యర్థి ఇతనేననిప్రకటించంది నువ్వుకాదా అని ఆయన ప్రశ్నించారు.