ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఎలా పొందాలి ?

261

పేదవాని గూడు గోడుగానే మిగిలిపోతోంది. కలల సౌథం కూలిపోతోంది. అర్హత ఉండీ ఇళ్లు మంజూరు కాని వారు కొందరు..మంజూరై బిల్లులు రాని వారు ఇంకొందరు.. బిల్లులు రాక ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేసిన వారు మరికొందరు.. ఇలా ఎన్టీఆర్‌ హౌసింగ్‌ కింద ఇళ్లు నిర్మించుకున్న వారి బాధ అంతులేకుండా ఉంది. ఇలాంటి పేదలందరికీ గూడు కల్పించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన ప్రతి పేదవానికీ పక్కా ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చారు. అంతేకాదు ఇచ్చిన రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని చెప్పారు. దీనిపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఆ పథకం ఇంకొన్ని రోజుల్లో మొదలుకానుంది.

పూర్తి వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి :

జగన్ కేబినెట్ ఇప్పుడే మొదలైంది. మంత్రులు వారి వారి పనుల్లో బిజీ బిజీ అయిపోయారు. ఆరోజే అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తర్వాత జగన్ ముందున్న లక్ష్యం ఒక్కటే.అది ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించండం. ఇప్పుడు ఆ పథకానికి సంబంధించిన అధికారులతో చర్చలు జరిపాడు. అర్హులైన వాళ్లందరికీ ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన డబ్బును ప్రభుత్వమే భరిస్తుంది. ఇంటి ఖాళీ స్థలం ఉంటె అందులో ఇల్లు కట్టుకోడానికి కూడా డబ్బులు ప్రభుత్వమే కల్పిస్తుంది. దీనికి సంబంధించి బ్యాంకుల వద్ద కూడా మాట్లాడాలని జగన్ అధికారులకు చెప్పాడు.

వైఎస్‌ జగన్‌ ప్రకటించిన పథకం వివరాలు చూస్తే… :
పేదలందరికీ పక్కా ఇళ్లు.
ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం .
ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌.
డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణ సదుపాయం.

ఇక దీని గురించి ఆ శాఖకు సంబంధించిన మంత్రి మాట్లాడుతూ…. వచ్చే ఏడాది ఉగాది వరకు అందరికి ఇల్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోమని జగన్ అధికారులకు చెప్పాడని చెప్పాడు. ఇక ఈ విషయం తెలియడంతో ఏపీ ప్రజలందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా జగన్ పేద ప్రజలందరి కష్టాలను తీర్చబోతున్నాడు. మరి పేదప్రజలందరికి జగన్ ఇల్లు కట్టించడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.