రైల్వేలో లక్ష ఉద్యోగాలు.. దేశంలోనే తొలిసారి !

406

దేశంలో ట్రాన్స్ ఫోర్ట్ రంగంలో ఎదురులేకుండా నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న ఇండియన్ రైల్వే దేశంలో తొలిసారిగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇండియాలో దూసుకుపోతున్న టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ తో కలిసి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రిక్రూట్‌మెంట్‌ని నిర్వహిస్తోంది. Tata Consultancy Services (TCS) పార్టనర్ ద్వారా లక్ష మంది ఉద్యోగులను online examinations ద్వారా తీసుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ పరీక్ష ఆగస్టు 9నుంచి నెలరోజుల పాటు జరగనుంది.

మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వీడియో ని చూడండి..

4.75 మిల్లియన్ అప్లికేషన్లను

4.75 మిల్లియన్ అప్లికేషన్లను

The Railway Recruitment Board 4.75 మిల్లియన్ అప్లికేషన్లను ఇప్పటికే రిసీవ్ చేసుకుంది. కాగా తొలి విడతలో 26,502 పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించనుంది. loco pilots (ALPs), టెక్నీషియన్ల కోసం ఈ పరీక్షను నిర్వహించనుంది.

62,907 పోస్టులకు..

అలాగే 19 మిలియన్ అప్లికేషన్లు Level-1 (erstwhile Group D)కు వచ్చాయని రైల్వే తెలిపింది. 62,907 పోస్టులకు ఈ అప్లికేషన్లు రానున్నాయి.

TCS ION అనే ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్ ఫ్లాట్ ఫామ్

కాగా దీనికి TCS ION అనే ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్ ఫ్లాట్ ఫామ్ ని ఉపయోగించబోతున్నారు. ఇప్పటికే అత్యంత శక్తివంతమైన Question Creation Wizardను దీనికోసం టీసీఎస్ రూపొందించింది. ఇందులో పోస్టుకి సంబంధించిన ప్రశ్నలనూ రూపొందించారు.

పోస్టుని బట్టి ప్రశ్నలు

ధరఖాస్తు చేసుకునే పోస్టుని బట్టి ప్రశ్నలు జంబ్లింగ్ పద్దతిలో మారుతూ ఉంటాయి. ప్రశ్నల కఠినత్వాన్ని బట్టి వరుస క్రమంలో వస్తాయి. దీనిని స్టాటికల్ నార్మలైజేషన్ గా వ్యవహరించనున్నారు.

128 బిట్ ఎన్ క్రిప్సన్

పేపర్ లీకేజీ, ఇతర మోసాలకు తావులేకుండా ఆన్ లైన్ పరీక్షకు 128 బిట్ ఎన్ క్రిప్సన్ ఉపయోగించింది. సంప్రదాయ అఫ్ లైన్ పద్దతిని కాదని ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు రైల్వే ముందుకు రావడానికి ఇది ప్రధాన కారణమని తెలుస్తోంది.

500 సెంటర్లలో 15 భాషల్లో

మొత్తం 500 సెంటర్లలో 15 భాషల్లో ఆగస్టు 9 నుంచి దాదాపు నెలరోజుల పాటు ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ని నిర్వహించనున్నారు.

లక్షమందిని రిక్రూట్..

ఇప్పటికే 47 లక్షల మంది అప్లయి చేసుకున్నారు. వీరిని వడబోసి లక్షమందిని రిక్రూట్ చేసుకుంటారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా పరీక్ష కేంద్రాల్లో కెమెరాలు, మొబైల్ జామర్లు , మెటల్ డిటెక్టర్లు లాంటివి ఉపయోగించునున్నారు.

లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులు

అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులు 26,502 ఉన్నాయి. లెవల్ 1 పోస్టులు 62,907 దాకా ఉన్నాయి. ఈ రెండింటికి వరుసగా 47 లక్షలు, 1.9 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి.

టీసీఎస్ 10 కోట్ల వరకు

కాగా టీసీఎస్ 10 కోట్ల వరకు అప్లికేషన్స్ వచ్చే భారీ పోటీ పరీక్షను నిర్వహించే సాంకేతిక సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఇప్పుడు జరుగుతున్న రైల్వే పరీక్షకు లక్షా 35 వేల కంప్యూటింగ్ నోడ్స్ తో సాయం అందిస్తోంది.

పర్యావరణం పరిరక్షణ

కాగా ఈ ఆన్ లైన్ ద్వారా పర్యావరణం పరిరక్షణ కూడా భారీ స్టాయిలోనే ఉంది. 10 లక్షల చెట్లను ఈ పరీక్ష ద్వారా కాపాడవచ్చు.ఎలాగంటే 10 లక్షల పేపర్ల నుంచి తయారయ్యే పేపర్లు ఈ పరీక్షను ఆఫ్ లైన్ లో నిర్వహించేందుకు అవసరమవుతాయి. వాటిని సేవ్ చేసినట్లే.

మరో రెండు కంపెనీలు

కాగా టీసీఎస్ తో పాటు మరో రెండు కంపెనీలు ఈ పరీక్షకు సాంకేతికంగా సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే ఆ రెండింటిని కాదని ఇండియన్ రైల్వే టీసీఎస్ ని ఎంచుకుంది.

టీసీఎస్ కంపెనీ టర్నోవర్

దీనికి ప్రధాన కారణం టీసీఎస్ కంపెనీ టర్నోవర్ ఎక్కవగా ఉండటమే. దీని వార్షిక టర్నోవర్ 150 మిలియన్ డాలర్లు.