అందం కోసం సర్జరీ చేయించుకుంది ఆ త‌ర్వాత ఆమె ముఖంలో నుంచి ఏం వచ్చిందో చూసి అందరూ షాక్!

3335

ప్రస్తుతం ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. మన శరీరాకృతిని మార్చుకోవ‌డంతో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. కాస్మెటిక్ సర్జరీ అనేది సర్వసాధారణం అయిపొయింది. అందంగా క‌నిపించేందుకు చాలామంది ప్లాస్టిక్ స‌ర్జ‌రీల మోజులో ప‌డుతున్నారు. అందంగా క‌నిపించాల‌ని ప్ర‌తిఒక్క‌రూ కోరుకుంటారు.

ఈ క్రింది వీడియో చూడండి.

అయితే అందం కోసం ప్లాస్టిక్ట్ స‌ర్జ‌రీలు చేయించుకుని ఉన్న అందాన్ని పోగోట్టుకుంటున్నారు మ‌రికొంత‌మంది. చాలా మంది వైద్యులు అందంగా చూపిస్తాం అని చెప్పి చేతకాని వైద్యంతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే సంఘటన కూడా అలాంటిదే. మ‌రింత అందంగా క‌నిపించాల‌ని స‌ర్జ‌రీ చేయించుకుంది ఆమెకు ఉన్న అందం కూడా పోయింది. అందంగా మార్చుకోవడానికి తక్కువఖర్చులో నాణ్యతలేని రైనో ప్లాస్టీ సర్జరీ చేయించుకుంది. కానీ, చివరికి ఆమె యొక్క ఆకృతిని చూసి అందరూ షాక్ కి గురయ్యారు.

Image result for surgery for skin whitening

ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న మహిళ పేరు బయటకు రాలేదు గాని, ఆమె అందంగా ఉన్నప్పటికీ మరింత అందంగా కనపడటానికి ప్ర‌య‌త్నించింది. దీంతో నాణ్యత లేని ఖర్చు తక్కువ అయిన రైనో ప్లాస్టీ సర్జరీ చేయించుకొని తనను తాను అందంగా మార్చుకోవాలని భావించింది. కానీ దురదృష్టవశాత్తు పరిస్థితి మరింత గా దిగజారింది. చికిత్స అనంతరం ఆమె ఎన్నో ఇన్ఫెక్షన్ లా భారిన పడింది. ఈమె కళ్ళ మధ్య అమర్చుకున్న ఇంప్లాంట్ ఏదైతే ఉందో అది చర్మాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చింది.అంతే కాకుండా ముక్కు ప్రదేశం నుండి పొడుచుకొని బయటకు వచ్చేసింది. ఆమె పరిస్థితి చూసిన వారందరూ షాక్ కు గుర‌య్యారు. ఆమెకు తక్షణమే వైద్య సహాయం అవసరం ఉంది లేదంటే, ఆమె పరిస్థితి ఇన్ఫెక్షన్ వల్ల మరింత దిగజారిపోయి ప్రమాదం ఉందని డాక్ట‌ర్లు చెప్పారు.

Image result for skin surgery

అయితే ఈ మహిళ ఏ ఆసుపత్రిలో అయితే చికిత్స చేయించుకుందో, ఆ ఆసుపత్రి వర్గాలు ఈమె యొక్క ప్రస్తుత పరిస్థితిలో వైద్యం చేయడానికి నిరాకరించారట. అంతేకాకుండా ఈమె యొక్క ప్రస్తుత పరిస్థితికి బాధ్యత వహించం అని తేల్చి చెప్పేశారట. దీంతో గత్యంతరంలేక ఆ మహిళ తన గోడుని సామజిక మాధ్యమాల్లో చెప్పుకుంది.ఈ మహిళకు జరిగిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది.

Image result for operation on face

 

దీంతో బ్యాంకాక్ లోని ప్రముఖ కాస్మెటిక్ క్లినిక్ ఈమెకు వైద్య సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు ఈమె యొక్క ఇంప్లాంట్ ని విజయవంతంగా తీసివేసి, ఆమెకు సోకిన ఇన్ఫెక్షన్ ని కూడా తగ్గించారు.వీరు చికిత్సని అంతా ఉచితంగానే చేసారు. కానీ దురదృష్టవశాత్తు ముక్కు దగ్గర ఎక్కడైతే సిలికాన్ ఇంప్లాంట్ ఉందో ఆ ప్రదేశంలో పెద్ద గుంత ఏర్పడింది.

Image result for operation on face

చికిత్స చేసే సమయంలో ఎప్పుడైతే సిలికాన్ ఇంప్లాంట్ ని చొప్పిస్తారో ఆ సమయంలో ఇంప్లాంట్ దాని చుట్టూ ఉన్న ఎముకలు మరియు కణజాలం తో అంత త్వరగా సఖ్యత ఏర్పరుచుకొని అక్కడ ఇమిడిపోదట. దీనికి బదులుగా చర్మం క్రింది భాగంలో అది ఇమిడినట్లు ఉంటుంది. ఇందువల్ల తరచూ ఆ ఇంప్లాంట్ పెట్టిన ప్రదేశం జరిగినప్పుడు ఆ ఇంప్లాంట్ గనుక సరైన పద్దతిలో పెట్టకపోతే, అది ఎక్కువగా కదలటం వల్ల ఇలాంటి దుష్ప్రభావాలు చోటు చేసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మంచి వైద్యులతో చికిత్స చేయించుకోమ‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు.