వాటర్ బాటిల్స్ లో నీళ్ళు తాగే ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో

249

మనం నిత్యం వాడే నీటి బాటిళ్లే మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయనే సంగతి మీకు తెలుసా? అవి ఎలాంటి రోగాలకు దారితీస్తాయో తెలుసా? ముఖ్యంగా మీ పిల్లలకు ఉపయోగించే వాటర్ బాటిళ్లను రోజూ శుభ్రం చేస్తున్నారా? శుభ్రం చేయకపోతే ఏర్పడే నష్టాలు ఏమిటీ? ఎలా శుభ్రం చేయాలి? మ‌రి ఈ విష‌యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

Image result for water bottles

ఎక్క‌డ లేని క్రిములు అన్నీ వాట‌ర్ బాటిల్స్ లోకి చేరుతాయి అనేది మ‌ర్చిపోకండి. వాట‌ర్ బాటిల్స పై ఉండే తేమ వ‌ల్ల సులువుగా బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇక మీ బాటిల్స్ కు క్యాప్ లేదా స్ట్రా ఉన్న‌ట్లు అయితే క‌చ్చితంగా వారానికి మూడు సార్లు క్లీన్ చేయాలి. ఇక వాట‌ర్ బాటిల్స్ లో ఉండే ఇకోలి అనే బ్యాక్టీరియా వ‌ల్ల గ్యాస్ట్రో స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఈ ఇకోలి బ్యాక్ట‌రీయా స‌మ‌స్య పోవాలి అంటే ఎప్ప‌టిక‌ప్పుడు బాటిల్స్ శుభ్రం చేసుకోవాలి అలాగే ప‌సుపు లేదా వేడి వాట‌ర్ ఉప్పు వేసి బాటిల్స్ క‌డిగితే ఎలాంటి బ్యాక్టిరీయా ఉన్నా పోతుంది. వేడి నీటిలో బాటిల్స్ శుభ్రం చేస్తే చాలా మంచిది. వాట‌ర్ బాటిల్స్ మూల‌న సర్ఫ్ వాట‌ర్ వేసి మూలన శుభ్రం చేయండి సులువుగా బ్యాక్టిరీయా చ‌నిపోతుంది. ఇక స‌ర్ఫ్ స్మెల్ పోవాలి కాబ‌ట్టి క‌చ్చితంగా వేడి నీటితో వాటిని శుభ్రం చేయండి. బాటిల్ నీరు మొత్తం ఇంకేలా బాటిల్ బోర్లించండి. బాగా త‌డిగా ఉందనిపిస్తే పొడిగుడ్డ‌తో దానిని క్లీన్ చేయండి. ఇలా చేస్తే మీకు బ్యాక్టిరీయా స‌మ‌స్య‌లు ఉండ‌వు అలాగే వారానికి మూడు సార్లు చేస్తే క‌చ్చితంగా బాటిల్స్ ఎటువంటి దుర్వాస‌న కూడా రాకుండా ఉంటాయి. ఇవి ప్లాస్టిక్ బాటిల్స్ వాడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్త‌లు అయితే ఇప్పుడు మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిల్స్ గురించి కూడా తెలుసుకుందాం.

Image result for water bottles

ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు, బ‌య‌ట తిరుగుతున్న‌ప్పుడు స‌హజంగానే ఎవ‌రైనా మిన‌ర‌ల్ వాట‌ర్ బాటిల్స్‌ను కొనుక్కొని తాగుతారు. అది మంచిదే. ప‌రిశుభ్రంగా ఉండే నీటిని తాగ‌డం మ‌న‌కు అవ‌స‌ర‌మే. అయితే అలా బాటిల్స్‌ను కొనేట‌ప్పుడు ఒక్క విష‌యాన్ని మాత్రం క‌చ్చితంగా గ‌మ‌నించాల్సిందే. ఎందుకంటే అది మ‌న ఆరోగ్యానికి సంబంధించింది.

Image result for water bottles

మీరు వాట‌ర్ బాటిల్‌ను కొని తాగడానికి ముందు దాని కింద భాగాన్ని ఒక‌సారి చూడండి. ఏం క‌నిపిస్తాయి..? ప‌రిశీలించారా..? అయితే జాగ్ర‌త్త‌గా చూడండి..! PP, HDPE, HDP, PETE, PET, PVC, LDPE అని ఏవైనా ఆంగ్ల అక్ష‌రాలు క‌నిపిస్తున్నాయా..? అవును, క‌నిపిస్తాయి. ఇంత‌కీ అవి ఎందుకు ప్రింట్ చేయ‌బ‌డి ఉంటాయో తెలుసా..? ఆ వాట‌ర్ బాటిల్ త‌యారు చేయ‌బ‌డిన ప్లాస్టిక్ ప‌దార్ధం అది. అంటే… ఎన్నో ర‌కాల ప్లాస్టిక్స్ ఉన్నాయి క‌దా. వాటిలో ఏ త‌ర‌హా ప్లాస్టిక్‌తో ఆ వాట‌ర్ బాటిల్‌ను త‌యారు చేశారో తెలియ‌జేస్తూ బాటిల్స్ కింద దానికి చెందిన లెట‌ర్స్‌ను ప్రింట్ చేస్తారు. మ‌రి వాటిలో మ‌న‌కు ఏది సేఫో, ఏది హాని క‌లిగిస్తుందో తెలుసుకుందాం.

Image result for children's drinking water bottles

PETE లేదా PET …
వాట‌ర్ బాటిల్ కింద గ‌న‌క ఈ లెట‌ర్స్ ప్రింట్ చేయ‌బ‌డి ఉంటే జాగ్ర‌త్త‌. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ తో త‌యారు చేసిన వాట‌ర్ బాటిల్స్‌లో నీరు పోస్తే ఆ నీటిలోకి ప్ర‌మాద‌క‌ర‌మైన విష ప‌దార్థాలు విడుద‌లవుతాయ‌ట‌. ఆ క్ర‌మంలో ఆ నీటిని తాగ‌డం మనకు మంచిది కాద‌ట‌.

Image result for children's drinking water bottles

HDPE లేదా HDP…
వాట‌ర్ బాటిల్ కింద గ‌న‌క ఈ లెట‌ర్స్ ఉంటే అప్పుడు ఆ బాటిల్‌లోని నీటిని మ‌నం నిర‌భ్యంత‌రంగా తాగ‌వ‌చ్చు. ఆ నీటిలోకి ఎలాంటి ప్లాస్టిక్ అవ‌శేషాలు చేర‌వు. అవి పూర్తిగా సుర‌క్షిత‌మైన‌వి. మ‌న‌కు ఎలాంటి హాని క‌లిగించ‌వు.

PVC లేదా 3V …
ఈ లెట‌ర్స్ వాట‌ర్ బాటిల్స్ కింద ప్రింట్ చేయ‌బ‌డి ఉన్నా జాగ్ర‌త్త‌గా చూడాలి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వ‌ల్ల నీటిలోకి కొన్ని ర‌కాల విష ప‌దార్థాలు చేర‌తాయి. అవి మ‌న శ‌రీరంలో హార్మోన్ అస‌మ‌తుల్య‌త‌ను క‌లిగిస్తాయి.

plastic-bottle-bottom-check

LDPE …
ఈ ప్లాస్టిక్‌తో చేసిన వాట‌ర్ బాటిల్స్ మ‌న‌కు శ్రేయ‌స్క‌ర‌మే. వీటి నుంచి ఎలాంటి వ్య‌ర్థాలు నీటిలోకి చేర‌వు. కానీ ఈ ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్స్ త‌యారీకి ప‌నికిరాదు. ప్లాస్టిక్ బ్యాగ్స్ ను దీంతో చేస్తారు.

Image result for children's drinking water bottles

PP…
పెరుగు క‌ప్పులు, టానిక్‌లు, సిర‌ప్‌లు ఉంచేందుకు వాడే చిన్న‌పాటి బాటిల్స్‌ను త‌యారు చేసేందుకు ఈ ప్లాస్టిక్‌ను వాడుతారు. ఇది మ‌న‌కు సుర‌క్షిత‌మే.

ఈ క్రింది వీడియో ని చూడండి

PS…
ఈ త‌ర‌హా ప్లాస్టిక్‌తో కాఫీ, టీ క‌ప్స్ త‌యారు చేస్తారు. అవి వాటిలోకి కార్సినోజెనిక్ స‌మ్మేళ‌నాల‌ను విడుద‌ల చేస్తాయి. క‌నుక ఈ త‌ర‌హా ప్లాస్టిక్‌తో చేసిన వ‌స్తువుల‌ను కూడా వాడ‌కూడ‌దు.

లేబుల్ ఏం లేక‌పోయినా లేదా PC అని ఉన్నా…
ఈ ప్లాస్టిక్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంది. దీంతో చేసిన ఏ ప్లాస్టిక్ నూ వాడ‌కూడ‌దు. చాలా ప్ర‌మాద‌క‌రం. కానీ కొంద‌రు ఈ ప్లాస్టిక్‌తోనే ఫుడ్ కంటెయిన‌ర్లు, వాట‌ర్ బాటిల్స్‌ను త‌యారు చేస్తున్నారు. క‌నుక మీరు వాడుతున్న ప్లాస్టిక్ వ‌స్తువులు దీంతో గ‌న‌క త‌యారై ఉన్నాయో లేదో ఒక‌సారి చెక్ చేసుకోండి.. ఇదంతా ఎందుకు అండి బాటిల్స్ కంటే రాగి చెంబు రాగి గ్లాసు లేదా చెంబులో నీరు తాగితే ఎంతో మంచిది. ఇక అల‌వాటు వ‌ల్ల మాన‌క‌పోతే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి, మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ ల రూపంలో తెలియ‌చేయండి.