మీరు ఛామానఛాయా రంగులో ఉన్నారా? కేవలం వారం రోజుల్లో తెల్లగా అవ్వాలంటే ఇలా చెయ్యండి

575

కావాల్సిన పదార్థాలు:

అరకప్పు టమాటా రసం, పావుకప్పు క్యారెట్ రసం, పావు కప్పు బీట్ రూట్ రసం, పావు చెంచా మిరియాల పొడి, అరచెంచా అల్లం రసం, అరచెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనె.

 

తయారీ విధానం:

ముందుగా టమాటా, క్యారెట్, బీట్ రూట్ లను కొంచెం ఉప్పు కలిపిన వేడి నీటిలో కడిగి శుభ్రం చేయాలి.
తర్వాత వాటిని ముక్కలుగా కోసి మెత్తగా దంచి ఆ ముద్దను పలుచని నూలు బట్టలో వేసి రసమంతా ఓ గిన్నెలో పిండుకోవాలి.

Image result for face packs

గుడ్డలో మిగిలిన పిప్పిని పారవేయకుండా ఓ పక్కన భద్రపర్చుకోవాలి. తయారైన రసంలో దంచి వడపోసి తీసుకున్న అల్లం రసం, గింజలు లేకుండా పిండిన నిమ్మరసం, మిరియాల పొడి, తేనె కలిపి పానీయం సిద్ధం చేసుకోవాలి. నీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యూస్ లో కలపొద్దు.

Image result for face packs

వాడే విధానం:

ఈ జ్యూస్ లోని పదార్థాలన్నీ కలిసిపోయేట్టు బాగా తిప్పి ఉదయం బ్రష్ చేసుకున్నాక ఓసారి, సాయంత్రం మరోసారి తాగాలి. ఇక జ్యూస్ తీయగా మిగిలిపోయిన క్యారెట్, టమాట, బీట్ రూట్ పిప్పిలో కొంచెం పాలమీది మీగడ కలిపి అతి మెత్తని గుజ్జులాగా నూరి ఆ మిశ్రమాన్ని నిదానంగా ముఖమంతా దట్టంగా లేపనం చేసుకోవాలి. ఒక గంట ఆగి గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి.

Image result for face packs

ప్రయోజనాలు:

పైన చెప్పిన విధంగా రెండు పూటలా అందాల పానీయాన్ని సేవిస్తూ అందాల లేపనాన్ని ముఖానికి రాస్తుంటే ఏడు రోజుల్లోనే ముఖంలో రంగు మారడం స్ఫష్టంగా తెలుస్తుంది.

Image result for face packs

చర్మం మృదువుగా కోమలంగా అవుతుంది. అయితే ఏడు రోజుల్లోనే ఎర్రగా మంచి మార్పును గమనించిన మీరు ఈ ప్రాసెస్ ని ఆపకుండా 40 రోజుల పాటు కొనసాగిస్తే అపురూపమైన సౌందర్య శోభ మీ సొంతమవుతుంది.