సగ్గుబియ్యంలోని ఆరోగ్య ప్రయోజనాలు..

152

ఎండాకాలంలో మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే ప‌దార్థాలు అనేకం ఉన్నాయి. వాటిలో స‌గ్గుబియ్యం కూడా ఒక‌టి. స‌గ్గుబియ్యంలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో ర‌కాల పోషకాలు ఉంటాయి. అవ‌న్నీ వేస‌విలో మ‌న‌ల్ని ఎండ నుంచి ర‌క్షిస్తాయి. అంతేకాకుండా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తాయి. సగ్గు బియ్యంలో కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల సగ్గుబియ్యంలో 355క్యాలరీలు, 94గ్రాముల కార్బో హైడ్రేడ్లు, ఫ్యాట్ కలిగివుంటాయి. అందువల్ల సగ్గు బియ్యం తీసుకుంటే ఎక్కువ శక్తి అందుతుంది. ఈ క్ర‌మంలోనే స‌గ్గుబియ్యంతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి

  1. స‌గ్గుబియ్యంలో పాలు, చ‌క్కెర పోసి వండుకుని తిన్నా లేదంటే.. ఉప్మా త‌ర‌హాలో స‌గ్గుబియ్యం తిన్నా శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఎండలో తిరిగే వారు స‌గ్గుబియ్యం తింటే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. వేస‌వి తాపం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.
  2. స‌గ్గుబియ్యం తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను సరిగ్గా ఉంచి హెల్తీగా ఉండటానికి సహాయపడతాయి. ఇందులో స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది
  3. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు స‌గ్గుబియ్యం తింటే ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి సమస్యలను తక్షణం నివారిస్తాయి.
  4. వేసవిలో కొంచెం ప‌నిచేసినా మ‌నం త్వ‌ర‌గా అల‌సిపోతాం. క‌నుక శ‌రీరంలో శ‌క్తి త్వ‌ర‌గా త‌గ్గుతుంది. అలాంటి వారు స‌గ్గు బియ్యం తింటే వెంట‌నే కోల్పోయిన శ‌క్తి తిరిగి వ‌స్తుంది. ఉత్సాహంగా ఉంటారు. ఎంత సేపు ప‌ని చేసినా త్వ‌ర‌గా అల‌సిపోరు. నీర‌సం ఉండ‌దు.
Image result for సగ్గుబియ్యం
  1. విరేచ‌నాలు అయిన వారు స‌గ్గుబియ్యం తింటే ఫ‌లితం ఉంటుంది. జ్వరం, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు జావ తాగితే ఎంతో మేలు.
  2. వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉంటాయి కాబట్టి గర్భిణీలు వీటిని డైట్ లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ కె మెదడుకి మంచిది.
  3. కండరాల గ్రోత్ కి సగ్గుబియ్యం చాలా ఉపయోగపతాయి. వీటిలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంతో పాటు బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెరుగుపరుస్తాయి.
  4. వీటిలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

ఇలా సగ్గుబియ్యం వలన మనకు అనేక లాభాలున్నాయి. కాబట్టి సగ్గుబియ్యం తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే మేము ఇచ్చిన ఈ సమాచారం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.