ఎండు ద్రాక్షను ఇలా తింటే ఎన్నో ప్రయోజనాలు

415

ద్రాక్ష పండ్ల‌ను ఎండ బెట్టి త‌యారు చేసే ఎండు ద్రాక్ష అంటే చాలా మందికి ఇష్ట‌మే. వీటినే కిస్ మిస్ పండ్ల‌ని కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువ‌గా స్వీట్లు, తీపి వంట‌కాల త‌యారీలో అంద‌రూ ఉప‌యోగిస్తారు. అయితే ఈ ఎండు ద్రాక్ష‌ల‌ను కొన్నింటిని తీసుకుని రాత్రిపూట నీటిలో నాన‌బెట్టి వాటిని ఉద‌యాన్నే తింటే దాంతో మ‌నకు ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌ట‌. ప్ర‌ధానంగా ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోవచ్చ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Related image
 1. ఎండు ద్రాక్ష‌ల్లో ఐర‌న్ ఎక్కువగా ఉంటుంది. ఇది ర‌క్త‌హీన‌త‌ను నివారిస్తుంది. పైన చెప్పిన‌ట్టుగా నిత్యం కొన్ని ఎండు ద్రాక్ష‌ల‌ను తింటుంటే దాంతో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.
 2. విట‌మిన్ బి, పొటాషియం వంటి పోష‌కాలు కిస్ మిస్ పండ్ల‌లో ఉన్నాయి. ఇవి గుండె సంబంధ వ్యాధుల‌కు అడ్డుగోడ‌గా నిలుస్తాయి.
 3. ఉద‌యాన్నే ఎండు ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. ఉద్యోగుల‌కు, పిల్ల‌ల‌కు కిస్ మిస్ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి.
 4. ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట‌రాల్ త‌గ్గుతుంది. అధిక బ‌రువు ఉన్న వారు నిత్యం కొన్ని కిస్ మిస్ పండ్ల‌ను తింటే అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.
 5. మ‌ధుమేహం ఉన్న‌వారు ఎండు ద్రాక్ష‌ల‌ను తింటుంటే ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.
Image result for ఎండు ద్రాక్ష
 1. ఉదయాన్నే ఎండు ద్రాక్ష‌ల‌తోపాటు కొన్నివెల్లుల్లి రేకుల్ని ప‌చ్చిగా అలాగే తింటుంటే బీపీ అదుపులోకి వ‌స్తుంది.
 2. ఎండుద్రాక్ష‌లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్క‌లంగానే ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ నుంచి శ‌రీరానికి ర‌క్ష‌ణ‌గా నిలుస్తాయి. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి.
 3. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం తొల‌గిపోతుంది. గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.
 4. ఎండుద్రాక్ష‌లో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శ‌రీరాన్ని ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తాయి.
 5. ఎండు ద్రాక్షల్లోని కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అధిక శక్తిని పొందడానికి, బరువు పెరిగేందుకు ఇవి చక్కని ఆహారంగా పనిచేస్తాయి. వైర‌ల్ జ్వ‌రాలు, ఇన్‌ఫెక్ష‌న్ల‌తో బాధ ప‌డే వారు కిస్ మిస్ పండ్ల‌ను తింటుంటే త్వ‌ర‌గా కోలుకుంటారు.

ఈ క్రింద వీడియో చూడండి

 1. సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తింటే అండాశయంలోని లోపాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది. మహిళలు నిత్యం కిస్‌మిస్‌లను తింటే మూత్రాశయంలో అమోనియా పెరగదు. రాళ్లు కూడా రావు.
 2. ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీటిలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీని వల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసిపోయి పిల్లలకు పోషకాలు అందుతాయి. పిల్లలు రాత్రి పూట పక్క తడుపుతుంటే వారికి వారం పాటు ప్రతి రోజూ రాత్రి పూట కొన్ని కిస్‌మిస్ పండ్లను ఇవ్వాలి. దీంతోపాటు ఆ వారం రోజుల్లో వారికి చలవ చేసే వస్తువులైన పెరుగు, మజ్జిగ లాంటి పదార్థాలను ఇవ్వకూడదు. ఈ విధంగా చేస్తే పక్క తడిపే అలవాటు తొలగిపోతుంది.

ఇలా చెప్పుకుంటూపోతే ఎండు ద్రాక్ష వలన మనకు అనేక లాభాలున్నాయి. మరి మేము ఇచ్చిన ఈ సమాచారం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.