కొబ్బరినీరు తాగుతున్నారా అయితే మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి

470

కొబ్బ‌రి మ‌న ఇంటి ప‌క్క‌న ఉండే చెట్లు అనే చెప్పాలి, మ‌న‌లో ప్ర‌తీ ఒక్క‌రికి కొబ్బ‌రి తెలుసు. ఇలా కొబ్బ‌రిని ఏ రూపంలో తీసుకున్నా వారికి అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. కొబ్బరి నీరు తరచుగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే కొబ్బరి నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. దాంతో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అలసటను, ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మంలోని మృతుకణాలను తొలగిస్తుంది.

అందుకే ఏ ఋతువులో అయిన తాగదగినవి కొబ్బరి నీరు అంటారు. లేత కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, క్రొవ్వులు అస్సలుండవు, చెక్కెర పరమితం గా ఉంటుంది. కొబ్బరి బొండం నీటిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది . శరీరములో నీటి లేమిని కరక్ట్ చేస్తుంది.శరీరంలో ప్రోటీన్స్ లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. అందువలన ప్రతిరోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నీరు తీసుకుంటే గుండె సంబంధితి వ్యాధులు దూరమవుతాయి. ముఖంపై మెుటిమలు, నల్లటి మచ్చలు గలవారు కొబ్బ‌రి గుజ్జుని రాసుకుంటే వారికి నిగారింపు వ‌స్తుంది.
కొబ్బరి నీటిలో 95 శాతం నీళ్లు, 2.8 శాతం చక్కెర, 0.5 శాతం వరకు లవణాలు ఉంటాయి. కనుక కొబ్బరి నీటిలో కొద్దిగా పసుపు, గంధం కలుపుకుని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

జీర్ణకోశ బాధలతో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారము, విరేచనాలు అయినపుడు ఓరల్ రి-హైడ్రేషన్ గా ఉపయోగపడుతుంది, , పొటాసియం గుండె జబ్బులకు మంచిది, వేసవి కాలములో శరీరాన్ని చల్లబరుస్తుంది, వేసవిలో చెమట కాయలు, వేడి కురుపులు, అమ్మవారు ఇలా తగ్గేందుకు కొబ్బరినీటిని లేపనంగావాడాలి . కొన్ని రకల పొట్టపురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి,, ముత్రసంబందమైన జబ్బులలోను, కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందుగా పనిచేస్తుంది . మినెరల్ పాయిజన్ కేసులలో పాయిజన్ ని క్లియర్ చేస్తుంది. ముదురు కొబ్బరిలో కంటే లేత కొబ్బరి బొండంలో ఎక్కువగా నీరు ఉంటాయి. దీనిలోని లవణాలు వేసవికాలంగా చల్లగా దాహం తీరుస్తాయి.