మజ్జిగను ఇలా వాడితే షుగర్ వ్యాధిని కంట్రోల్ చెయ్యవచ్చు..

57

షుగర్ వ్యాధి అనేది చాలా ప్రమాదకరం. దీనిని నియంత్రించుకోవడంలో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 30 మిలియన్లకు మించి ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారంటే ఇది ఎంత మేరకు విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వారు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు.. మధుమేహంలో రెండు రకాలు ఉంటాయి. అయితే ఏ తరహా మధుమేహం అయినా ఒకసారి వచ్చిందంటే ఇక దానికి జీవితాంతం మందులు వాడాల్సిందే.. లేదంటే గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, చూపు పోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ క్రమంలోనే మధుమేహానికి డాక్టర్లు సూచించే మందులతోపాటు ఇప్పుడు నేను చెప్పే చిట్కాలు పాటిస్తే దాంతో మధుమేహాన్ని దూరంగా ఉంచుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందామా..

Image result for మజ్జిగ
  1. ఒక గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ మెంతుల పొడి అరచెంచా నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున అలాగే పడుకునేముందు ఒక గ్లాస్ తీసుకుంటే షుగర్ వ్యాధిని కంట్రోల్ చెయ్యవచ్చు.
  2. నిత్యం ఉదయాన్నే పరగడుపున 10 కరివేప ఆకులను అలాగే నమిలి తింటుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. షుగర్ అదుపులో ఉంటుంది.
  3. ఒక పాత్రలో నీటిని పోసి అందులో గుప్పెడు మెంతులను వేసి రాత్రి పూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి అనంతరం మెంతులను తినేయాలి. ఇలా చేస్తే చాలా త్వరగా మధుమేహం అదుపులోకి వస్తుంది. లేదంటే మెంతులను పొడి చేసి నీటిలో కలుపుకుని రెండు పూటలా భోజనానికి ముందు తాగినా చాలు. షుగర్ వ్యాధిని అదుపు చేయవచ్చు.
Image result for మజ్జిగ
  1. ఒక గ్లాస్ నీటిలో రెండు టీస్పూన్ల పొడపత్రి ఆకు చూర్ణాన్ని వేసి బాగా కలిపి ఉదయాన్నే పరగడుపునే తాగాలి. మధుమేహాన్ని అదుపు చేసే గుణాలు పొడపత్రి ఆకులో సమృద్ధిగా ఉంటాయి.
  2. నేరేడు గింజలను ఎండబెట్టి పొడి చేయాలి. ఆ పొడిని రోజూ ఉదయం, సాయంత్రం భోజానికి ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ మోతాదులో వేసి బాగా కలిపి తాగాలి. దీంతో షుగర్ అదుపులోకి వస్తుంది.
  3. మర్రి ఊడలను సేకరించి ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో నానబెట్టాలి. రాత్రంతా అలా చేశాక మరుసటి రోజు ఉదయం ముక్కలను తీసేసి నీటిని వడకట్టి తాగితే ఫలితం ఉంటుంది.
  4. బాగా ముదిరిన కాకరకాయలను విత్తనాలతో సహా అలాగే ఎండబెట్టాలి. అనంతరం వాటిని పొడి చేయాలి. ఆ పొడిని ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగాలి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.

ఈ క్రింద వీడియో చూడండి

  1. రోజూ ఉదయాన్నే పరగడుపున 30 ఎంఎల్ మోతాదులో ఉసిరి కాయ జ్యూస్‌ను తాగాలి. లేదంటే ఉసిరిపొడిని నీటిలో కలుపుకుని తాగినా చాలు, మధుమేహం అదుపులో ఉంటుంది.
  2. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు లేదా మూడు లేత మారేడు ఆకులు, లేత వేపాకులను బాగా నలిపి అనంతరం ఆ మిశ్రమాన్ని అలాగే తినేయాలి. ఇలా చేసినా షుగర్ వ్యాధిని అదుపులోకి తేవచ్చు.
  3. మోదుగ చెట్టు ఆకులు లేదా పూలను తెచ్చి ఎండబెట్టాలి. అనంతరం వాటిని పొడి చేయాలి. ఆ పొడితో కషాయం కాచి ఉదయం పరగడుపున, రాత్రి భోజనం చేసే ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం చక్కగా అదుపులో ఉంటుంది.

ఇలా కొన్ని రకాల చిట్కాల వలన మీరు షుగర్ వ్యాధిని కంట్రోల్ చెయ్యవచ్చు. మరి షుగర్ వ్యాధిని తగ్గించుకోడానికి మేము చెప్పిన చిట్కాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.