హెచ్ఐవి చికిత్స కొరకు HAART థెరఫీ (HAART- హైలీ యాక్టివ్ యాంటిరిట్రోవైరల్ థెరఫీ)

307

1981 లో హెచ్ఐవి (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోం) ని కనుగొన్న తర్వాత దాని నిర్ములనకు ఇప్పటికి కూడా సరైన మందును కనిపెట్టలేకపోతున్నారు. హెచ్ ఐవీ మీద అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. దానిని కొద్దిగా నియంత్రించే పద్దతులను కనిపెడుతున్నారు కానీ దాని పూర్తీ నిర్మలనను కనిపెట్టలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మరొక థెరపీని కనిపెట్టారు. మరి దాని గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for hiv aids

హెచ్ఐవి చికిత్స కొరకు HAART థెరఫీ అనే దానిని కనిపెట్టారు. హార్ట్ అనగా ‘హైలీ యాక్టివ్ (అత్యంత చురుకైన) యాంటీ రెట్రో వైరల్ డ్రగ్ థెరపీ’ కు సంక్షిప్త నామంగా ఉంటుంది. ఇది 1990 వ దశకం చివరి నుండి HIV చికిత్సలో ఉపయోగించబడుతున్న కాంబినేషన్ డ్రగ్ థెరపీ గా ఉంది. 1996లో, ప్రోటీస్ ఇన్హిబిటర్లను ప్రవేశ పెట్టడం ద్వారా, వైద్యులు మూడు లేదా అంతకన్నా ఎక్కువ డ్రగ్ ఏజెంట్లను కలిపి, హెచ్ఐవి జీవిత చక్రంలోని భిన్న దశలను ప్రతిఘటించేలా, క్రమంగా వైరస్ విస్తరణను తగ్గించగలిగేలా చేయగలిగారు. అంతేకాకుండా హెచ్ఐవిని పూర్తిగా నిలిపివేయడంలో కూడా ఆస్కారం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ “హార్ట్” చికిత్స వినియోగం ద్వారా, ఎయిడ్స్ ఆధారిత మరణాల సంఖ్యలో అత్యధికంగా 50 శాతం తగ్గుదలను పరిశీలించినట్లు అధ్యయనాలు సైతం తెలుపుతున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

నిజానికి ఈ హార్ట్ ను’ ట్రిపుల్ థెరపీ ‘ మరియు ‘ ట్రిపుల్ డ్రగ్ కాక్టెయిల్ ‘ అని కూడా పిలవడం జరుగుతుంటుంది. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. “హార్ట్” హెచ్ఐవి ని శరీరం నుండి పూర్తి స్థాయిలో తొలగించలేకపోయినా కూడా, ఆ వ్యక్తి జీవిత కాలాన్ని పెంచడంలో ఎంతగానో సహకరిస్తుంది. కొన్ని ప్రత్యేకించిన సందర్భాలలో, ఎయిడ్స్ కారక వైరస్లను పూర్తి స్థాయిలో కూడా తొలగిపోవడం గమనించడం జరిగిందని పరిశోధకులు చెప్తున్నారు. క్రమంగా ఎయిడ్స్ చికిత్సలో సహాయ సహకారాలను అందివ్వగలుగుతుంది. ఒకప్పుడు అత్యంత ప్రాణాంతకమైన రుగ్మతగా ఉన్న ఈ హెచ్ఐవి సమస్యను, “హార్ట్” చికిత్స ద్వారా సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతున్నామని వైద్యులు చెబుతున్నారు అంతేకాకుండా గణనీయ ఫలితాలను సాధించగలిగామని కూడా చెప్తున్నారు.

Image result for hiv aids

“హార్ట్” చికిత్సలో ఉపయోగించబడే మందులు : ప్రస్తుతం ఐదు తరగతులలో యాంటీ రెట్రో వైరల్ డ్రగ్స్ మందులను విభజించడం జరిగింది. ప్రతి ఔషధం హెచ్ఐవి జీవిత చక్రంలోని నిర్ధిష్ట దశలలోని వైరస్లను అణిచివేయడానికి బాధ్యత వహిస్తుంది. ఈ ఐదు తరగతులు దిగువ పేర్కొన్నవిధంగా వున్నాయి :
1) ఎంట్రీ లేదా ఫ్యూషన్ ఇన్హిబిటర్లు (CCR5 గ్రాహక ప్రతిరక్షకాలను కలిగి ఉంటాయి) :
CD4 (తెల్ల రక్త కణాలు) కణాల్లోకి వైరస్ ప్రవేశించకుండా నిరోధించడానికి ఈ ఇన్హిబిటర్లు రూపొందించడం జరిగింది.
2) న్యూక్లియోసైడ్ మరియు న్యూక్లియోటైడ్ రివర్స్ ట్రాన్స్కిప్టేస్ ఇన్హిబిటర్లు (NRTI/NtRTI):
హెచ్ఐవి ప్రతిక్షేపణం కొరకు నిర్దేశించబడింది. దీనికి రివర్స్ ట్రాన్స్ స్క్రిప్టేస్ (RT) అనే ఎంజైమ్ అవసరం అవుతుంది. ఈ NRTi, వైరస్ల ఎదుగుదలను అరికట్టడంలో సహాయపడేలా తప్పుడు రివర్స్ ట్రాన్స్ స్క్రిప్టేస్ వర్షన్లను వైరస్లకు అందించడం ద్వారా హెచ్ఐవి వైరస్ను నిరోధించగలుగుతుంది .

Image result for hiv aids


3) నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇన్హిబిటర్ (NNRTI) :
హెచ్ఐవి పెరుగుదలకు దోహదపడే, కీలక ప్రోటీన్ నిలిపివేయడంలో ఇది ఎంతగానో సహాయం చేస్తుంది.
4) ఇంటిగ్రేస్ ఇన్హిబిటర్స్ (INSTI) :
హెచ్ఐవి CD4 కణాల్లోకి ప్రవేశి౦చినప్పుడు అది కణాలలోని జన్యు పదార్థాలలోకి చొచ్చుకునిపోవడం ప్రారంభిస్తుంది. ఇంటిగ్రేస్ అనే ప్రోటీన్ అందించే సహాయం వలన ఈ చేరిక సాధ్యపడుతుంది. ఈదశను పూర్తి చేసే వైరస్ల సామర్థ్యాన్ని నిరోధించేందుకు ఇంటిగ్రేస్ ఇన్హిబిటర్స్ రూపొందించబడ్డాయి.
5) ప్రోటీస్ ఇన్హిబిటర్ (PI) :
ప్రోటీస్ అనే ప్రోటీన్ (HIV ప్రతిరూపకానికి అవసరమైన కీలకమైన పదార్ధం), ఈ ఇన్హిబిటర్ ద్వారా తొలగించబడుతుంది.

మరి వవ హార్ట్ థెరపీ గురించి అలాగే దానిలో ఉన్న అంశాలు అలాగే హెచ్ఐవీ నిర్ములనకు అది ఉపయోగపడుతున్న విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.