15 రోజులు క్రమం తప్పకుండా ఇలా చేస్తే తెల్లజుట్టుని పూర్తిగా నల్లగా మార్చే చిట్కా త‌ప్ప‌కుండా చేయండి

384

తెల్లజుట్టు ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య. 20ఏళ్లు దాటకుండానే చాలామందికి తెల్లజుట్టు వచ్చేస్తోంది. దీంతో తెల్లజుట్టు సమస్యను తొలగించుకునేందుకు చాలామంది బ్యూటీ పార్లర్లు, స్పాల వెంట తిరుగుతున్నారు.. వయస్సుతో పాటు వెంట్రుకలు తెల్లబడటం సహజం. కానీ చిన్నవయస్సులోనే తల నెరసిపోతే మాత్రం ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. రోజూ తీసుకునే ఆహారంలో మల్టీ విటమిన్లు, బి కాంప్లెక్స్ విటమిన్లు వుండేలా చూసుకోవాలి.

Image result for white hair

రోజువారీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం, కోడిగుడ్డు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలను ఎంత ఎక్కువగా వాడితే అంత మంచిది. ఆకుకూరలను వారానికి నాలుగుసార్లు తీసుకుంటే జుట్టు నెరసిపోవు. ఇంకా ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు. ఆకుకూరలను రోజువారీగా ఒక కప్పు తీసుకుంటే.. జుట్టు బాగా పెరగడంతో పాటు తెల్లజుట్టు సమస్య వుండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Related image

సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ఏదో ఆలోచిస్తూ కూర్చోకూడదు. ఆలోచనలకు స్వస్తి పలకాలి. ఎందుకంతే ఆలోచనలు, ఒత్తిడి కారణంగానూ తెల్లజుట్టు సమస్య వుంటుంది. అందుకే మెదడును ప్రశాంతం వుంచుకునేందుకు ప్రయత్నించాలి. ఇలాచేస్తే జుట్టు నెరసిపోకుండా వుండటమే కాకుండా.. ఒత్తిడితో ఏర్పడే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇప్పుడు తెల్ల జుట్టు స‌మ‌స్య‌కు ఓ చిట్కా కూడా తెలుసుకుందాం.15 రోజులు క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టుని పూర్తిగా నల్లగా మార్చే అద్భుతమైన పద్ధతి, ఎలానో తెలుసుకోండి.

Image result for white hair

మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రంలో తెల్ల జుట్టును నల్లపర్చే అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కేవలం మనం ఇంట్లో తయారు చేసుకుని ఆచరించి కూడా సమస్యను అదిగమించొచ్చు. జుట్టు రాలడం ఆగిపోవడమే కాదు తెల్లబడడమూ ఆగిపోతుంది. ఇక అప్పటి నుంచి వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా మారడం ప్రారంభిస్తాయి. దీన్ని వంశ పారంపర్యంగా బట్టతల ఉన్న వేలాది మందిపై ప్రయోగించగా విజయవంతమైంది. పలు కేసుల్లో 70 సంవత్సరాల వయసు వారికీ నల్లబడడం కనిపించింది. అప్పటి నుంచి ఆయుర్వేద వైద్యంలో దీనిని భాగం చేశారు. ఈ పదార్థాల్లో కొన్ని మన ఇంట్లో లభించేవి కాగా మిగిలినవి అన్ని ఆయుర్వేద షాపుల్లో లభిస్తాయి.

ఈ క్రింది వీడియో చూడండి

కావల్సిన పదార్థాలు:
మెత్తగా రుబ్బిన గోరింటాకు- 100 గ్రాములు
కాఫీ పొడి- 3గ్రాములు
పెరుగు-25గ్రాములు
నిమ్మరసం- 4స్పూన్లు
ఖదిరము(కటేచు)- 3గ్రాములు
బ్రహ్మి చూర్ణం- 10గ్రాములు
ఉసిరి చూర్ణం- 10గ్రాములు

అన్నింటిని బాగా కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా 15 రోజులు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు నల్లబడుతుందని మన ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. మ‌రి చూశారుగా తెల్ల జుట్టు స‌మ‌స్య ఉన్న‌వార వీటిని ఫాలో అవ్వండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.