భోజనం చేసిన వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా?

1170

భోజనం చేస్తున్నామంటే చాలు నీళ్ళ చెంబు పక్కన ఉండాల్సిందే, మిగతా సమయాల్లో తాగామన్నపుడు తాగారు కాని పని గట్టుకుని మరీ కంచం ముందు, నీళ్ల గ్లాస్ ఉండాల్సిందే…అదేమంటే అయ్యో నీళ్ళు లేకుండా భోజనం ఎలా చేస్తారండి అయినా భోజనానికి ముందు అరటి ఆకు వేసిన తరువాత ఏది పెట్టినా పెట్టకపోయినా ముందు గ్లాసుడు నీళ్ళు అయితే ఉండాలని పెద్దలు చెప్పారు కదండీ అని అంటారు…

ఈ క్రింది వీడియో చూడండి.

నిజానికి భోజనం తీసుకునే సమయంలో నీరు తాగాలా వద్దా అన్న విషయంపై అపోహలున్నాయి. చాలా మంది నీళ్లచెంబు ముందు పెట్టుకుని భోజనానికి కూర్చుంటారు. మరికొంత మంది ముద్దముద్దకి నీళ్లు తాగుతారు. మరికొందరు భోజనం పూర్తి అయిన తర్వాత ఎత్తిన చెంబు దించకుండా గటగటా నీళ్లు తాగేస్తారు. మరి ఏది మంచిది?

Image result for drinking water

రోజు శరీరానికి సరిపోయేన్ని నీటిని తాగటం ఆరోగ్యానికి మంచిదే. శరీర జీవక్రియలు సాఫీగా జరగడానికి నీళ్లు అవసరమే. భోజనం చేసేటపుడు నీరు తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆహారం మింగటానికి, జీర్ణమవటానికి సహాయపడుతుంది. అయితే భోజనం చేసే సమయంలో నీరు ఎక్కువగా తాగితే జీర్ణక్రియ వేగం తగ్గుతుంది. ఇందుకు కారణం.. ఎక్కువ నీరు తాగినప్పుడు జీర్ణాశయంలో విడుదలయ్యే హార్మోన్స్‌, యాసిడ్స్‌ గాఢత తగ్గిపోయి.. తీసుకున్న ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది.

Related image

జీర్ణక్రియ ఆలస్యమైతే తినే ఆహారంలో విషపదార్థాల మోతాదు పెరుగుతుంది. భోజనం చేయడానికి అరగంట ముందు, భోజనం చేసిన తర్వాత అరగంట వరకు నీళ్లు తాగకపోతే జీర్ణక్రియ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగే అవకాశం ఉంది. భోజన సమయంలో నీళ్లు వీలైనంత తక్కువగా తాగితే మంచిది. చల్లని నీటి కన్నా.. గోరువెచ్చని నీళ్లు తాగితే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే చాలా మందికి ముఖ్యంగా హైటెక్ జీవనం గడుపుతున్న వారికి ఐస్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అనేక మంది భోజనం చేసిన వెంటనే చల్లని నీరు తాగుతుంటారు. ఇలా ఐస్ వాటర్ తాగడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

Image result for drinking water before meals

ఒకవేళ ఖచ్చితంగా ఐస్ వాటర్ తాగాలని అనుకుంటే మాత్రం భోజనం చేశాక 20-30 నిమిషాల తర్వాత తాగడం మంచిది. భోజనం చేసిన వెంటనే చల్లటినీరు తాగితే గుండెపోటు, కేన్సర్ వంటి వ్యాధులు దరిచేరే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, కోవ్వు ప్రేగుల్లో పేరుకుని పోతుంది. అదేసమయంలో భోజనం చేశాక గోరు వెచ్చటి నీరు తాగితే గుండెతో పాటు శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పైగా, గోరు వెచ్చని నీరు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ చేరకుండా చేస్తుంది. నిజానికి అలా చల్లటి నీరు తాగితే చిన్న పేగులు దగ్గరికి ముడుచుకుపోయి ఆకలిని మందగింప చేస్తుంది….అంటే చల్లదనానికి పేగులు దగ్గరికి కాబడి కాస్త తిన్నాకూడా కడుపు నిండినట్టుగా ఉంటుంది, ఆకలి వేయడం క్రమంగా తగ్గుతూ వస్తుంది…

Image result for drinking water before meals

ఇక ఆరుర్వేదం నీటి గురించి అయితే ఇలా చెబుతుంది, ఆహారం తీసుకునే గంటకు ముందు లేదా ఆహారం తీసుకున్న గంట తరువాత నీటిని నెమ్మదిగా చప్పరిస్తూ తాగాలని చెప్తోంది…నీటిని తాగేటపుడు గ్లాసు పైకి ఎత్తి గబగబా తాగేయకూడదు, అలా తాగితే ఏ ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఆహారం జీర్ణం అవ్వాలంటే మన నోటిలో తయారయ్యే లాలాజాలం ఎంతో ఉపయోగపడుతుంది….కాబట్టి మనం నీటిని నెమ్మది నెమ్మది గా చప్పరిస్తూ తాగినపుడు నోటిలో ఉండే లాలాజలం నీటితో కలిసి ఆహరం జీర్ణమవడానికి ఎంతో మేలు చేస్తుంది… అని వివరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు ఇది ఇటు ఆయుర్వేదం అటు ఆధునిక వైద్య రంగం సంయుక్తంగా ఒప్పుకున్నా మాట…మరి ఇప్పటినుండి మీరూ ఈ విధంగా పాటించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి…..ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా…అంతకంటే ఏం కావాలి చెప్పండి….