ఉదయాన్నే అన్నం, కూర వేడి చేసుకొని తింటున్నారా.? అయితే వెంటనే ఈ వీడియో చూడండి.

250

ఉదయం వండిన ఆహార పదార్థాలను మధ్యాహ్నం తినేటప్పుడో లేదా రాత్రి తినేటప్పుడో మళ్లీ ఒకసారి వేడిచేసుకుని తినే అలవాటు ఉంటుంది చాలామందికి. అయితే ఎప్పుడు వండింది అప్పుడే తినాలి కానీ మళ్లీ వేడిచేసుకుని తినడం అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా కొన్ని పదార్ధాలైతే అస్సలు వేడి చేయకూడదని బ్రిటీష్‌ ఫుడ్‌ స్టాండర్డ్‌ ఏజెన్సీ, యూరోపియన్‌ ఫుడ్‌ ఇన్ఫర్మేషన్‌ కౌన్సిల్‌ ఒక నివేదిక విడుదల చేశాయి. ఇంతకీ ఆ వేడి చెయ్యకూడని పదార్థాలు ఏంటో చూద్దామా.

Image result for eating food
 • కోడికూర :
  చికెన్‌ను ఉడికించేటప్పుడు ముక్కలు అన్ని వైపులా ఉడికేలా జాగ్రత్త పడాలి. లేదంటే చికెన్‌లో కొద్ది మొత్తంలో ఉండే సాల్మొనెల్లా బ్యాక్టీరియాతో ప్రమాదమే. మైక్రోవేవ్‌లో త్వరగా అవుతుంది కానీ అన్ని వైపులా సరిగా ఉడకదు. దాంతో చికెన్‌లో ప్రొటీన్లు భిన్నంగా విడిపోయి కడుపులో ఇబ్బంది కలిగిస్తాయి.
 • అన్నం :
  మనం రోజూ తినే అన్నాన్ని కూడా రెండోసారి వేడి చేసి తినకూడదు. గది ఉష్ణోగ్రతలో అన్నం పెడితే ‘‘స్పోర్స్‌ (బీజ పరాగములు) రెట్టింపవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించినట్టే. అలాంటి అన్నాన్ని తినడం వల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి. తిరిగి వేడిచేయడం వల్ల హాని కలిగించే విషపదార్థాలు నాశనం కూడా కావు. అందుకని ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడే కొత్తగా వండుకొని తినడం మంచిది.
Image result for eating food and chicken
 • బంగాళాదుంపలు :
  ఉడికించిన బంగాళాదుంపలను గది ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల క్లొస్ర్టీడియమ్‌ బొటులినమ్‌ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దుంపల్ని తిరిగి వేడి చేసినా బ్యాక్టీరియా నాశనం కాదు. అందుకని బంగాళాదుంపని ఉడికించాక చల్చార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలే తప్ప బయట ఉంచొద్దు.
 • పుట్టగొడుగులు :
  పుట్టగొడుగుల్ని సరిగా నిల్వ చేయకపోయినా, తిరిగి వేడి చేసినవి తిన్నా పొట్ట పాడయిపోతుంది. అయితే వాటిని ఫ్రిజ్‌లో ఉంచిన 24 గంటల లోపయితే 70 డిగ్రీల సెంటిగ్రేడు ఉష్ణోగ్రత దగ్గర వేడి చేయొచ్చు.

ఈ క్రింద వీడియో చూడండి

 • పాలకూర :
  పాలకూరలో అధిక గాఢత కలిగిన నైట్రేట్‌ ఉంటుంది. తరువాత ఇదే నైట్రోజమైన్స్‌గా మారుతుంది. ఇది కార్సినోజెనిక్‌. ఈ పదార్థం రక్తప్రసరణ ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేసే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. దీన్నే ‘‘బేబీ బ్లూ సిండ్రోమ్‌’’ అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది.
 • బీట్ రూట్ :
  బీట్ రూట్ ను బ్లడ్ ప్లేట్స్ ఎక్కువగా పెరగడానికి తింటూ ఉంటారు. పచ్చివి, జ్యుస్ చేసుకుని, కర్రీ చేసుకుని తింటారు. కర్రీ చేసిన బీట్ రూట్ ను చల్లారిన తర్వాత మళ్ళి వేడి చేసుకుని తినకూడదు.

ఇలా కొన్ని పదార్థాలను ఒకసారి వండాక తిరిగి వేడి చేయకపోవడమే మంచిది. ఎప్పటికప్పుడు వండుకు తినడానికి మించిన ఆరోగ్యసూత్రం మరోటి లేదు. కాబట్టి ఈ ఆహార పదార్థాలను వేడి చేసుకుని తినేముందు ఒక్కసారి ఆలోచించండి.