బిర్యానీ ఆకుతో జుట్టు సమస్యలకు ఇలా చెక్ పెట్టొచ్చు

811

ఘుమ ఘుమ‌లాడే బిర్యానీ అంటే అంద‌రికీ ఇష్ట‌మే. చాలా మంది బిర్యానీని లొట్ట‌లేసుకుంటూ తింటారు. అయితే అందులో వేసే బిర్యానీ ఆకు గురించి మీకు తెలుసా..? దాంతో బిర్యానీకి చ‌క్క‌ని టేస్ట్ వ‌స్తుంది. మంచి సువాస‌న వ‌స్తుంది. అయితే ఇదే కాదు, బిర్యానీ ఆకు వ‌ల్ల మ‌నకు ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఈ ఆకుల‌తో న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాలంటే ఈ వీడియో చూడండి

1. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొన్ని బిర్యానీ ఆకుల‌ను వేసి మ‌రిగించాలి. బాగా మ‌రిగాక వ‌చ్చే నీటిని చల్లార్చాలి. ఈ నీటిని షాంపూ చేసుకున్నాక త‌ల‌కు ప‌ట్టించి క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. అదేవిధంగా బిర్యానీ ఆకుల‌ను పొడి చేసుకుని దానికి కొబ్బ‌రినూనె క‌లిపి జుట్టుకు ప‌ట్టించాలి. 30 నిమిషాలు ఆగాక త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చుండ్రు పోతుంది.

2. బిర్యానీ ఆకుల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో దాన్ని క‌లిపి ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి ముందు తాగితే ర‌క్తంలో ఉన్న షుగ‌ర్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. బిర్యానీ ఆకుల్లో మ‌ధుమేహాన్ని త‌గ్గించే గుణాలు ఉన్నాయ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది.

3. బిర్యానీ ఆకు పొడిని నీటిలో క‌లిపి భోజ‌నం తరువాత తీసుకుంటే జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ త‌గ్గుతాయి.

4. బిర్యానీ ఆకు పొడిని రోజూ తీసుకుంటే ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

5. శ‌రీరంలో ఆయా భాగాల్లో క‌లిగే నొప్పుల‌ను త‌గ్గించే గుణాలు బిర్యానీ ఆకులో ఉన్నాయి. స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు బిర్యానీ ఆకులో ఉంటాయి. కొన్ని బిర్యానీ ఆకులు, ఆముదం చెట్టు ఆకుల‌ను తీసుకుని మెత్త‌ని పేస్ట్ చేసుకోవాలి. దాన్ని నొప్పి ఉన్న ప్ర‌దేశంలో రాసి 20 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. నొప్పులు త‌గ్గుతాయి.

6. బ్రెస్ట్ క్యాన్స‌ర్‌ను త‌గ్గించే గుణాలు బిర్యానీ ఆకులో ఉన్నాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

7. బిర్యానీ ఆకుల పొడిలో నీరు క‌లిపి పేస్ట్‌లా చేసి దాన్ని గాయాలు, పుండ్ల‌పై రాస్తే అవి త్వ‌ర‌గా మానిపోతాయి.

8. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని 4, 5 బిర్యానీ ఆకుల‌ను వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. అనంతరం అందులో ఒక శుభ్ర‌మైన గుడ్డ‌ను ముంచి ఛాతిపై రాసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు వెంట‌నే న‌య‌మ‌వుతాయి.

9. బిర్యానీ ఆకుల పొడిని నీటిలో క‌లుపుకుని తాగితే కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

10. బిర్యానీ ఆకుల పొడితో టీ చేసుకుని తాగితే ఒత్తిడి, ఆందోళ‌న ఇట్టే మాయ‌మ‌వుతాయి. మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త చేకూరుతుంది.

గ‌మ‌నిక‌: గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు, శ‌స్త్ర చికిత్స చేయించుకునేవారు, చేయించుకున్న‌వారు బిర్యానీ ఆకుల‌ను వాడ‌రాదు.