బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య‌కు చెక్ పెట్టండిలా.!? ఈ చిట్కాలు బోల్డ్ హెడ్ మీద హెయిర్ ను మొలిపిస్తాయ్.

87

ప్ర‌స్తుత త‌రుణంలో అందంగా క‌నిపించాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. ఆడ‌, మ‌గ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు అందంపై దృష్టి సారిస్తున్నారు. అయితే అందం విష‌యానికి వ‌స్తే వాటిలో ప్ర‌ముఖ పాత్ర పోషించేవి శిరోజాలు. ఆడ‌వారికైతే జుట్టు రాల‌డం, మ‌ళ్లీ పెర‌గ‌డం మామూలే కానీ మ‌గ‌వారికి మాత్రం అలా వెంట్రుక‌లు రాల‌డం మొద‌లైతే చివ‌ర‌కు అది బ‌ట్ట‌త‌ల‌కు దారి తీస్తుంది. ప‌ని ఒత్తిడి, కాలుష్యం, కెమిక‌ల్స్ ఉప‌యోగించి త‌యారు చేసిన షాంపూలు, దీర్ఘ‌కాలిక వ్యాధులు… ఇలా కార‌ణాలు ఏమున్నా మ‌గ‌వారిలో ఇప్పుడు బ‌ట్ట‌త‌ల చాలా త‌క్కువ వ‌య‌స్సులోనే వ‌స్తోంది. మళ్ళి వెంట్రుకలు మొలవడానికి మగవారు చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు. అయినా కానీ వెంట్రుకలు రావు. అలా బట్టతల సమస్యతో బాధపడుతున్న వారి కోసమే ఇప్పుడు నేను చిట్కాలు చెప్పబోతున్నాను. వాటిని ఫాలో అయితే మీ బట్టతల మీద వెంట్రుకలు మొలవడం ఖాయం. మరి ఆ టిప్స్ ఏమిటో చూద్దామా.

ఈ క్రింద వీడియో చూడండి

  1. కొద్దిగా కుంకుమ పువ్వును తీసుకుని దాన్ని పాల‌లో బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని త‌ల‌కు అప్లై చేయాలి. త‌ర‌చూ ఇలా చేస్తుంటే రాలిపోయిన జుట్టు మ‌ళ్లీ పెరుగుతుంది.
  2. న‌ల్ల‌మిరియాల పొడిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి బాగా మిక్స్ చేయాలి. దీన్ని త‌ల‌కు ప‌ట్టించాలి. ఇది బ‌ట్ట‌త‌ల రాకుండా చూస్తుంది. జుట్టు పెరుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.
  3. కొబ్బ‌రిపాల‌ను తీసుకుని నేరుగా జుట్టుకు రాయాలి. ఇది జుట్టు పెరుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.
  4. కొద్దిగా కొత్తిమీర‌ను తీసుకుని దాన్ని బాగా న‌లిపి పేస్ట్‌లా చేసి ఆ పేస్ట్ నుంచి ర‌సం తీయాలి. ఆ రసాన్ని నిత్యం త‌ల‌కు ప‌ట్టిస్తుంటే కొద్ది రోజుల‌కు వెంట్రుక‌ల పెరుగుద‌ల మొద‌ల‌వుతుంది.
Image result for బ‌ట్ట‌త‌ల
  1. కాఫీ గింజ‌ల‌ను తెచ్చి వాటిని పొడి చేయాలి. ఆ పొడిలో కొంత నీరు క‌లిపి పేస్ట్‌లా చేసి త‌ల‌కు ప‌ట్టించాలి. అనంత‌రం కొంత సేపు ఆగాక త‌ల‌స్నానం చేయాలి. దీంతో జుట్టు బాగా పెరుగుతుంది. ఇది బ‌ట్ట‌త‌ల‌కు చ‌క్క‌ని టిప్‌గా ప‌నిచేస్తుంది.
  2. మెంతుల‌ను నీటిలో నాన‌బెట్టి మెత్త‌ని పేస్ట్‌లా చేయాలి. దీన్ని త‌ల‌కు అప్లై చేసి కొంత సేప‌టి త‌రువాత స్నానం చేసేయాలి. ఊడిపోయిన వెంట్రుక‌ల‌ను తిరిగి మొలిపించేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.
  3. ఎండ బెట్టిన ఉసిరి కాయ ముక్క‌లు, క‌ర‌క్కాయ ముక్క‌లు, తానికాయ ముక్క‌ల‌ను 10 చొప్పున తీసుకుని వాటిని రాత్రి నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే ఆ నీటిని త‌ల‌కు రాసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఊడిపోయిన జుట్టు తిరిగి మ‌ళ్లీ మొలుస్తుంది.
Related image
  1. మందార పూలు, గోరింటాకు, క‌ల‌బంద గుజ్జుల‌ను తీసుకుని మిశ్ర‌మంగా చేయాలి. దీన్ని న‌ల్ల నువ్వుల నూనెలో వేసి బాగా క‌షాయంలా కాయాలి. దీన్ని వ‌డ‌బోసి త‌ల‌కు రాసుకోవాలి. ఇలా చేస్తుంటే వెంట్రుక‌లు బాగా పెర‌గ‌డ‌మే కాదు, న‌ల్ల‌బ‌డ‌తాయి కూడా.
  2. క‌రివేపాకు ర‌సం, వెల్లుల్లి పొట్టుల‌ను పైన చెప్పిన‌ట్టుగా న‌ల్ల నువ్వుల నూనెలో వేసి బాగా కాసి పెట్టుకుంటున్నా వెంట్రుక‌లు బాగా పెరుగుతాయి.

ఇవేనండి బట్టతల సమస్యకు కొన్ని చిట్కాలు. వీటిని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీ బట్టతలా మీద వెంట్రుకలు వస్తాయి. మరి మేము చెప్పిన ఈ చిట్కాలు మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.