పిప్పిపన్ను బాధ నుంచి 2 నిమిషాల్లో శాశ్వత విముక్తి

15

హాయిగా నవ్వడానికి అందమైన పళ్లు వరుస కావాలి… తిన్నది బాగా జీర్ణం కావడానికి బాగా నమలగలిగే దంతాలు కావాలి.. స్పష్టంగా, అందంగా మాట్లాడడానికి ఆరోగ్యకరమైన పళ్ళు ఉండాలి… అంతేకాదు.. కొన్నిసార్లు కొన్ని ప్రమాదాల నుంచి రక్షించేందుకు కూడా బలమైన దంతాలు కావాలి…ఒకటా.. రెండా… ఎన్నో రకాలుగా మనకు సేవలందించే మన దంతాలు ఆరోగ్యానికి వాకిళ్లు. రోగాలకు రహదారులు కూడా. అందుకే నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం కూడా సంపూర్ణంగా ఉంటుంది. నోరు మంచిదైతే ఊరేమో గాని.. శరీర ఆరోగ్యమైతే మంచిదవుతుంది. మరి ఆ నోటిని, దంతాలను ఎలా కాపాడుకోవాలి ముఖ్యంగా పిప్పిపన్ను వస్తే వాటిని ఎలా నివారించాలి తెలుసుకుందాం.నిజమే పిప్పి పన్ను బాధ అనుభవించినవారికి తప్ప వేరేవారికి తెలియదు. నిజంగా ఆ బాధతో బాధపడేవారు బాధపడలేక చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటారు. ఆ పరిస్థితుల్లో తక్షణం ఉపశమనం కోసం వెతుకులాడటం జరుగుతుది. నరకం కనిపిస్తుంది…పిప్పి పన్నును పీకించే వరకు చుక్కలు కనిపిస్తాయి. ఇంతకూ ఏం చేస్తే పిప్పి పన్ను నొప్పిని తగ్గించాలంటే? దానికి ముందుగా ఈ ఆయుర్వేద చిట్కా తెలుసుకుందాం, మర్రి చెట్టు దగ్గర పాలను తీసుకుని పిప్పి పన్ను మధ్యలో హోల్ దగ్గర, దూదితో ఆ పాలను ముంచి రోజుకు మూడు సార్లు వేయండి. మర్రి పాలు పిప్పిళ్లల్లోకి వెళ్లి నొప్పిని తగ్గిస్తాయి.

Image result for పిప్పి పన్ను

తర్వాత మర్రి ఊడ సన్నది తెచ్చి అది దంచి ఆ పొడిని పిప్పిపన్నుపై పెట్టండి..మీకు నొప్పి రాదు మీకు పిప్పి పన్ను తగ్గిపోతుంది.పిప్పి పన్ను ద్వారా ఏర్పడిన గుంతలో ఆహారం ఇరుక్కొని తెగ బాధ పెడుతుంది…అపుడు కాస్త ఇంగువని తీసుకొని ముద్దగా చేసి ఆ గుంటలో నింపాలి దాని వల్ల అక్కడ ఉన్న నొప్పి నిమిషాల్లో తగ్గిస్తుంది…అలాగే మరో మంచి ఉపాయం లవంగం నూనె ఈ లవంగం నూనెలో కాస్త దూదిని ముంచి పిప్పి పన్ను మీద పెట్టి పై పన్ను తో అదిమి పెడితే కొద్దిసేపటిలో నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది..అలాగే కొన్ని పత్తి గింజలను తీసుకొని వాటిని కాల్చి బూడిద చేయాలి దాంతో రోజు పళ్ళు తోముకొని గోరువెచ్చని నీటితో నోటిని పుక్కిలించాలి..కొన్ని సార్లు పిప్పి పళ్లతో విపరీతమైన బాధ కలుగుతుంది..దీనికోసం మంచి జిల్లేడు ఆకులు రెండు, మూడు తీసుకుని రెండు చేతులతో నలిపి ఒక గరిటలో రసం తియ్యాలి. అలాగే పసుపు ఉప్పును కలిపి పేస్ట్ లా చేసి పళ్ళు తోముకున్నా పిప్పి పన్ను సమస్య నుండి బయటపడవచ్చు.

ఈ క్రింద వీడియో చూడండి

తిన్నా తర్వాత దంతాలకు ఆహారం అతుక్కోకుండా చూసుకోవాలి. తినగానే తప్పనిసరిగా పుక్కిళించాలి. మనం నమిలేటప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి బాగా నమలి తినడం ఒత్తిడినీ తగ్గిస్తుంది. చూయింగ్ గమ్ మంచిదే. దంతాలకు వ్యాయామం నమలడం వల్ల. చక్కెర లేని చూయింగ్ గమ్‌లు నమిలితే మరీ మంచిది.తాజా పండ్లు ఎక్కువగా తినాలి. కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. పిల్లలకు చెరుకు లాంటి ఎక్కువగా నమిలే పదార్థాలను పెట్టడం వల్ల దంతాలు దృఢంగా తయారవుతాయి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి బలమైన దవడలు, దంతాలు ఏర్పడ్తాయి. కాబట్టి మంచి ఆహారమే దంతాలకు క్షేమకరం. గర్భిణులకు కాల్షియం సప్లిమెంట్లు అందుకే ఇస్తారు. కాని టెట్రాసైక్లిన్స్ లాంటి యాంటిబయాటిక్స్, టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాల మందుల వల్ల గర్భస్థ శిశువుపై ప్రభావం పడుతుంది. మరి చూశారుగా పిప్పి పళ్ల సమస్య ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మీకు కచ్చితంగా ఉపశమనం కలుగుతుంది.