ఉదయం నిద్రలేవగానే….. చేయకూడని 5 పనులు.!

156

చాలా మంది ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ముందుగా మొబైల్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో ఏం పోస్ట్ లు వచ్చాయో చూస్తారు. ఆపై తమకు మెయిల్స్ ఏమైనా వచ్చాయేమోనని మెయిల్ చెక్ చేసుకుంటారు. ఆ త‌రువాత యథావిధిగా త‌మ త‌మ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభిస్తారు. అయితే నిత్యం ఉద‌యాన్నే నిద్ర‌లేవ‌గానే ఎవ‌రైనా చేయాల్సిన పనులు ఇవి కాదు. వేరే కొన్ని ఉన్నాయి. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయి, ఒక గ్లాస్ వాటర్ తాగి, బ్రేక్ ఫాస్ట్ చేసి ప్రశాంతంగా రోజు ప్రారంభించినట్టయితే ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది కదా. కానీ మనం అలా చేయం. లేవడం లేవడమే హడావిడిగా లేచి పరుగులు పెడ్తూ పనులు చేస్కుంటాం రోజంతా అంతే గజిబిజిగా ఉంటాం. దీనికి కారణం మనం పొద్దున్న లేవగానే చేసే 5 చిన్నచిన్నమిస్టేక్స్…అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ క్రింద వీడియో చూడండి

  • అప్పటివరకు ముడుచుకుని పడుకుని అదే విధంగా నిద్రలేచి డెయిలీ యాక్టివిటీస్ పైకి వెళ్తాం. దీని వల్ల బద్దకంగా అలాగే ఉంటుంది. అలాకాకుండా నిద్రలేవగానే బెడ్ పైనే కాళ్లు చాచి ,చేతులతో కాలి పాదాలను పట్టుకుని కాసేపు ఉండండి. దీని వల్ల ఒత్తిడి దూరమవడమే కాదు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రోజంతా ఉల్లాసంగా ఉంటారు.
  • చాలామంది చీకట్లో పడుకోవడానికి ఇష్ట పడ్తారు. నిద్ర లేచేప్పుడు కూడా అదే చీకటి గదిలోనే మేల్కొంటారు. దీనివల్ల ఇంకా నిద్రొస్తున్నట్లుగా ఉండడమే కాదు, మెదడు అంతా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి నిద్ర లేచే సమాయానికి కర్టెన్స్ తీసి ఉంచాలి. అలా బైటి వెలుతురు వచ్చే అవకాశం లేకపోతే, కనీసం నిద్ర లేవగానే బయటికెల్లి కాసేపు వెలుతురులో తిరగాలి.
  • పొద్దునే లేవాలని అలారం పెడతాం కానీ అది మోగుతూంటే ఆఫ్ చేసి పడుకుంటాం. అలా పడుకోవడం వల్ల మన నిద్ర కంప్లీట్ అవ్వదు సరికదా దాని వల్ల నిద్ర లేచాక సోమరితనం ,అలసట కలుగుతాయి. ఇలా అలారం ఆఫ్ చేసి పడుకోవడం కరెక్ట్ కాదని నిపుణులు చెప్తారు.
Image result for mobile use in morning time
  • చాలామందికి పొద్దున్న లేవగానే ఏ దేవుడి మొఖమో, ఇంట్లో వాళ్ల మొఖమో చూసే అలవాటుంటుంది. కానీ ఇప్పుడందరూ నిద్ర లేవగానే మొబైల్ తల దూర్చేస్తున్నారు. అలా కాకుండా మీ మీ ముఖ్యమైన పనులపైన దృష్టి మరల్చండి.
  • బెడ్ కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. మనశరీరం ఉదయం 8 నుండి 9మద్య కార్టసోల్ అని పిలవబడే ఎనర్జీ రెగ్యులేటింగ్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. కాఫీ తాగడం వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో మనకు శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం తొమ్మిది లోపు కాఫీ అవాయిడ్ చేయడం మంచిది.