వాయిదా పడిన వైఎస్సార్ బయోపిక్…ఎప్పుడు విడుదలో తెలుసా..

295

ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ‘యాత్ర’ అనే టైటిల్ మీద ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.మమ్ముట్టి ఇందులో వైఎస్ పాత్రను చేస్తున్నాడు.జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహీ వి. రాఘవ్‌ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు.

Related image

 

ఈ సినిమాని డిసెంబర్‌ 21న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి.అయితే వాళ్ళు చెప్పినట్టు ఈ చిత్రం డిసెంబర్ 21 న విడుదల అవ్వడం లేదంట.ఎందుకంటే బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘యన్‌.టి.ఆర్‌: కథానాయకుడు, యన్‌.టి.ఆర్‌: మహానాయకుడు’ పేరుతో రెండు భాగాలుగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు.

Image result for ysr biopic

‘యన్‌.టి.ఆర్‌: మహానాయకుడు’ విడుదల అయ్యే రోజున వైఎస్‌ బయోపిక్‌ ‘యాత్ర’ సినిమాని ఆ చిత్రబృందం రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం.ఎన్నికలు కూడా దగ్గర పడతాయి కాబట్టి ఆ సినిమాకు పోటీగా నిలబెడితేనే ఎన్నికలలో వైఎస్ సత్తా అందరికి తెలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.