బిగ్ బాస్ 3 : సీఎం జగన్ సపోర్ట్‌తో విన్నర్‌గా రాహుల్..?

321

ఎన్నో సంచలనాలు, ఆపై మలుపులతో చివరి అంకంకు చేరుకున్న బిగ్ బాస్ సీజన్ 3 ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్ విజేత యాంకర్ శ్రీముఖి అవుతుందని అందరూ కూడా అనుకోగా ఊహించని విధంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. టాలీవుడ్ సెలబ్రిటీల సపోర్ట్, సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ శ్రీముఖి సొంతం. అయితే రాహుల్ బిహేవియర్ నచ్చిన చాలామంది రాహుల్ కు సపోర్ట్ చేశారు. వివిధ సర్వేలు, పోల్ రిజల్ట్స్ కూడా రాహుల్, శ్రీముఖిలలో ఎవరో ఒకరు విజేత కాబోతున్నారని చెప్పాయి. ఎందుకంటే.. శ్రీముఖి, రాహుల్‌లకు వచ్చే ఓట్లు ఇద్దరికీ సమానంగా ఉండటంతో విజేత ఎవరు అవుతారో అనే అందరు ఉత్కంఠగా ఎదురుచూశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ ఇద్దరి ఫాన్స్ విపరీతంగా పోటీ పడి మరీ ప్రచారం చేశారు.

Image result for telugu bigg boss winner

రెండు గ్రూప్ లుగా విడిపోయి నానా హంగామా చేశారు. మా శ్రీముఖి విన్ అని కొందరు అంటే కాదు మా రాహుల్ విన్ అని మరికొందరు అన్నారు. అయితే అంతిమ పోరులో రాహుల్ విన్ అయ్యాడు. రాహుల్‌ సీజన్ 3 విన్నర్‌గా ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. అయితే రాహుల్ విన్ అవ్వడానికి వైఎస్ జగన్ ఫాన్స్ సపోర్ట్ చెయ్యడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. రాహుల్ సిప్లిగంజ్..ఎన్నికలకుముందు జగన్‌ ఇమేజ్‌ను హైలెట్ చేస్తూ అదిరిపోయే రేంజ్‌లో పాట పాడాడు. ఆ సాంగ్ జగన్ ఫ్యాన్స్‌ను భీభత్సంగా ఆకట్టుకుంది. అంతేకాదు జగన్ అంటే ఏంటో జనాలకు తెలిసేలా ఆ సాంగ్ ఉంది. జగన్ సీఎం అవ్వడానికి ఆ సాంగ్ కూడా ఒక కారణం అందుకే ఇప్పుడు రాహుల్‌కి జగన్ ఫ్యాన్స్ అంతా గంపగుత్తగా ఓట్లు వేశారంట. దీంతో సీఎం జగన్ సపోర్ట్‌తో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ గెలిచాడు అని జగన్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

మొదటి రెండు సీజన్లు శివబాలాజీ, కౌశల్ మందా విజేతలుగా నిలవగా.. మూడో సీజన్‌లోనైనా లేడీస్‌కు ఛాన్స్ దక్కుతుందని భావించారు. ఆమె ఫ్యాన్స్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ చివరికి వచ్చేసారి శ్రీముఖి గ్రాఫ్ ఒక్కసారిగా తగ్గిపోతే రాహుల్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఫైనల్ రేసులో రన్నరప్‌గా అవుతాడని అనుకున్న రాహుల్ టైటిల్ సొంతం చేసుకోగా శ్రీముఖి రెండు పర్సెంట్ ఓట్లు తేడాతో రన్నరప్‌గా నిలిచినట్లు సమాచారం. ఇక వరుణ్ సందేశ్ మూడో స్థానంలో.. బాబా భాస్కర్ నాలుగో స్థానంలో.. అలీ రెజా ఐదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ ట్రోఫీ, రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్‌ను అందుకోనున్నాడు. మరోవైపు ఫినాలే ఎపిసోడ్‌కు హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్, అంజలి, క్యాథరిన్‌ల హై వోల్టేజ్ డాన్స్ పెర్ఫార్మన్స్‌లు ఉండగా.. ఇవాళ సాయంత్రం 6.30 నుంచి ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఈ క్రింద వీడియో చూడండి