యాత్ర’ రివ్యూ.. ‘జయహో రాజన్న’

341

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర చిత్రం రూపొందించారు. మలయాళీ స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో నటించారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ చూసినప్పుడు మమ్ముట్టి వైఎస్ఆర్ లాగే హావ భావాలూ పలికిస్తూ మెప్పించారు. టాలీవుడ్ లో వరుసగా ప్రముఖుల బయోపిక్ చిత్రాలు వస్తున్న తరుణంలో యాత్ర కూడా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దామా.

Image result for yatra movie

కథ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అప్పటికే అధికారం కోల్పోయి పదేళ్లు అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఈసారి ఎలాగైనా ఎన్నికలలో గెలవాలని అనుకుంటుంది. అందుకు ఒక మార్గనిర్దేశకుడి కోసం అన్వేషిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడే ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తాడు. ఆయనకు అప్పజెప్పుతారు కాంగ్రెస్ పార్టీ భాద్యతలను. అయితే ప్రభుత్వం మీద ప్రజలకు ఇంకా విశ్వసం ఉంది ఆ విశ్వాసాన్ని తమ పార్టీ వైపుకు తిప్పుకోవాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించి పాదయాత్ర అనే మహా అస్త్రాన్ని తీసుకుంటాడు. ఇక కథ మొత్తం ఈ పాదయాత్ర మీదనే నడుస్తుంది.ప్రజలు పడుతున్న బాధలు, ప్రజలకు ఏమి అవసరం అనే అనేక విషయాలను ఎలా చుపించాడనేదే మిగతా కథ.

Image result for yatra movie

సినిమాను విశ్లేషించాలంటే… యాత్ర ఫస్టాఫ్ చాలా బోరింగ్ గా ఉంది. వైఎస్ఆర్ పరిచయ సన్నివేశాలు నుంచే సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే ఆ సీన్స్ చూపించే నుంచే సినిమా బోర్ అనిపిస్తుంది. ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ సంగీతం పెద్ద మైనస్, పాటలు కూడా అక్కట్టుకునేలా లేవు.వైఎస్ అభిమానులు అయితేనే ఈ సినిమా చూడండి మిగతా వాళ్ళైతే ఎందుకు వచ్చాము అని అనిపిస్తుంది. చిత్రం మొత్తం స్లోగా, బోరింగ్ గా సాగుతుంది. కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ముఖ్యమంత్రి అయ్యాకా పెట్టిన ఎన్నో పథకాలు ఈ పాదయాత్ర నుంచే పుట్టుకొచ్చినట్టు చూపించారు. అయితే ఎక్కడ నెగెటివిటీ చూపించకుండా మొత్తం పాజిటివిటీ చూపించడం పెద్ద మైనస్. డబ్బా కొట్టినట్టు అనిపించింది. అలాగే జగన్ వచ్చే సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్లస్ పాయింట్స్ ; మమ్ముట్టి నటన, కొన్ని భావోద్వేగ సీన్స్, సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్ : డైరెక్షన్, స్క్రీన్ ప్లే, పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫస్ట్ హాఫ్, స్లో డ్యూరేషన్.

ఈ సినిమాకు మేము ఇస్తున్న రేటింగ్ 2.5/ 5