యాత్ర ట్రైలర్ విడుదల : ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలనుంది

206

ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ‘యాత్ర’ అనే టైటిల్ మీద ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.మమ్ముట్టి ఇందులో వైఎస్ పాత్రను చేస్తున్నాడు.మహి వి. రాఘవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలను అనసూయ, పోసాని, వినోద్ కుమార్, సచిన్ ఖేడేకర్ పోషిస్తున్నారు. 70ఎంఎం పిక్చర్స్ పతాకంపై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related image

తాజాగా ‘యాత్ర’ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.’నా విధేయతని, విశ్వాసాన్ని బలహీనతగా తీసుకోకండి. నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ..జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం. తెలుసుకోవాలనుంది..వినాలనుంది. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలనుంది’ అంటూ ట్రైలర్ లో వచ్చే సంభాషణలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ సందర్భంగా ప్రజలు పడుతున్న కష్టనష్టాలను తెలుసుకోవడం పేదరికానికి మించిన శిక్ష లేదంటూ డైలాగు చెబుతూనే పేదల కోసం ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశ పెట్టడం వెనకవున్న ఉద్దేశ్యాన్ని ఈ ట్రైలర్‌లో చూపెట్టారు.