సెన్సార్‌ కంప్లీట్ చేసుకున్న ‘యాత్ర’

204

ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే. ‘యాత్ర’ అనే టైటిల్ మీద ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.మమ్ముట్టి ఇందులో వైఎస్ పాత్రను చేస్తున్నాడు.మహి వి. రాఘవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Related image

ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలను అనసూయ, పోసాని, వినోద్ కుమార్, సచిన్ ఖేడేకర్ పోషిస్తున్నారు. 70ఎంఎం పిక్చర్స్ పతాకంపై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Image result for yatra movie

ఇటీవలే ‘యాత్ర’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసారు. ట్రైలర్ చిత్రం మీద అంచనాలకు క్రియేట్ చేసింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్‌కు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. నిజ జీవిత సంఘటలన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ ‘యు’ సర్టిఫికేట్‌ను జారీ చేశారు సెన్సార్‌ బోర్డ్ సభ్యులు.