తారక రత్నను అతని భార్యను ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎందుకు పక్కన పెట్టింది

599

నందమూరి కుటుంబం నుంచి ఎందరో హీరోలు వచ్చారు.హరికృష్ణ బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న లాంటి హీరోలు వచ్చారు.అయితే అందులో ఎన్టీఆర్ బాలయ్య తప్ప ఎవరు స్టార్ హీరో కాలేకపోయారు.కళ్యాణ్ రామ్ కొంచెం పరవాలేదు అనిపించినా తారక రత్న మాత్రం అస్సలు ఆకట్టుకోలేకపోయాడు. ఎన్నో చిత్రాలు చేసిన ఆశించినంత స్థాయిలో హీరోగా గుర్తింపు సాధించలేకపోయాడు. హీరోగా విజయం రాకపోయేసరికి విలన్ అవతారమెత్తాడు.అయినా ఫలితం రాలేకపోయింది.తారకరత్న రీల్ లైఫ్ లో పక్కన పెట్టి రియల్ లైఫ్ ను చూస్తే కొన్ని ఆసక్తికర విషయాలు మనకు కనిపిస్తాయి.మరి ఆ విషయాల గురించి తెలుసుకుందామా.

Image result for Taraka Ratna and his wife

తారకరత్న కుటుంబ పెద్దలను ఎదిరించి ఒక అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.అయితే ఆమె ఎవరన్నా సంగతి తారకరత్న సన్నిహితులకు తప్ప బయట వ్యక్తులకు అస్సలు తెలియదు.సినిమా ఫంక్షన్స్ కు హాజరు అయినా ఆయన ఎప్పుడు తన భార్యను తీసుకురాలేదు.ఇంతకు తారకరత్న పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా…టిడిపి దివంగత నేత మాజీ హోమ్ మంత్రి ఎలిమిరెడ్డి మాధవరెడ్డి కోడలినే తారకరత్న పెళ్లి చేసుకున్నాడు.అసలు విషయంలోకి వెళ్తే మాధవరెడ్డి కొడుకు అలేఖ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.అయితే కాలక్రమేనా ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు.అయితే ఒక పోగ్రామ్ లో అలేఖ్యకు చుసిన తారకరత్న ఆమె మీద మనసు పారేసుకున్నాడు.ఆమె కూడా ఇతనిని ఇష్టపడింది.ఇదే విషయాన్నీ ఇరు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.అయితే నందమూరి కుటుంబం ఒప్పుకోలేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీంతో ఇక లాభం లేదనుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.వారికి ఒక పాప కూడా ఉంది.దాదాపు 5 ఏళ్లుగా వారు కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు.అందుకే నందమూరి కుటుంబ ఫంక్షన్స్ లో తారకరత్న అంతలా కనిపించడం లేదు.సినిమా ఫంక్షన్స్ కు కూడా హాజరు కాడు.ఎవరైనా చనిపోతే వచ్చి పరామర్శించి వెళ్ళిపోతాడు తప్ప మిగతా ఏ ఫంక్షన్స్ కు కూడా హాజరు కాడు.అతని తండ్రి మోహన కృష్ణ అయితే తారకరత్నను కొడుకు అని ఎప్పుడో మర్చిపోయాడు.ఫామిలీ మొత్తం మర్చిపోవాలని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాడంట.అలా ప్రియురాలి కోసం కుటుంబం మొత్తాన్ని దూరం చేసుకున్నాడు.కానీ అన్నలు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రం అపుడప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటారంట.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.తారకరత్న గురించి అలాగే ప్రేమ కోసం కుటుంబాన్ని దూరం చేసుకున్న విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.