హరికృష్ణ కడసారి చూపుకు రాని మోహన్ బాబు కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

432

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మన అందరికి తెలిసిందే.గురువారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.పలువురు సినీ ప్రముఖులు రాజకీయనాయకులు,కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు జరిగాయి.అయితే చాలా మంది ప్రముఖులు హరికృష్ణ అంత్యక్రియలకు హాజరు అయ్యారు.కానీ డైలాగ్ కింగ్ మోహన్ బాబు మాత్రం హరికృష్ణ అంత్యక్రియలకు హాజరు కాలేదు.మరి మోహన్ బాబు ఎందుకు రాలేదో తెలుసుకుందామా.

Image result for harikrishna

హరికృష్ణకు మోహన్ బాబుకు మధ్య ఎంత మంచి బంధం ఉందొ మన అందరికి తెలిసినదే.హరికృష్ణ తెలుగు సినిమాకు ఎంట్రీ ఇచ్చింది కూడా మోహన్ బాబు నటించిన శ్రీరాములయ్య సినిమా ద్వారానే.ఆ సినిమా సమయం నుంచి ఇద్దరి మధ్య సన్నిహితం ఉంది.ఎన్టీఆర్ ఫామిలీ అంటే చాలా ఇష్టపడే మోహన్ బాబు ఆ కుటుంబం నుంచి వచ్చిన హరికృష్ణను చాలా ఇష్టపడేవాడు.అయితే ఇప్పుడు హరికృష్ణ చనిపోయాడు.అయితే అంతలా ఇష్టం ఉన్నా కూడా హరికృష్ణను చూడటానికి మోహన్ బాబు ఎందుకు రాలేదు..ఈ విషయం గురించి మోహన్ బాబే స్పందించాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తాను హరికృష్ణ అంత్యక్రియలకు కానీ హరికృష్ణను చూడటానికి కానీ రాకపోవడానికి కారణం నేను ఇండియాలో లేను. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను.అందుకే రాలేకపోతున్నాను.తమ్ముడు హరికృష్ణ మరణం నన్ను ఎంతో కలచివేసింది.నాకు ఎంతో ఇష్టమైన మా అన్న ఎన్టీఆర్ బిడ్డ.డ్రైవర్ రాముడు సినిమా దగ్గర నుంచి మా అనుబంధం కొనసాగుతుంది.తమ్ముడు హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశాడు.ఈ కారణంగానే హరికృష్ణను చూడటానికి కానీ అంత్యక్రియలకు కానీ మోహన్ బాబు రాలేకపోయాడు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం గురించి అలాగే మోహన్ బాబు రాకపోవడం గురించి అలాగే ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.