వ‌రుణ్ సినిమా షూటింగ్ ఎక్క‌డ జ‌రిగిదంటే?

385

యంగ్ డైరెక్ట‌ర్ సంక‌ల్ప్ రెడ్డి డైరెక్ష‌న్లో మెగా హీరో వ‌రుణ్ తేజ్ సినిమా చేస్తున్నారు అనే విష‌యం తెలిసిందే… సంక‌ల్ప్ ఇప్ప‌టికే సినిమా ఇండ‌స్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు.. తొలి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నాడు… ఇప్పుడు తాజాగా స్పేస్ థ్రిల్లర్ సినిమాతో వరుణ్ తేజ్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు…వరుణ్ తేజ్ వ్యోమగామి పాత్రలో న‌టిస్తున్నారు.. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు డిసెంబ‌ర్ లో వెండితెర‌పై క‌నిపించ‌నుంది.

Image result for space movie on varun tej

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన చిన్న షెడ్యూల్ ను చిత్రబృందం త‌మిళ‌నాడులోని రామేశ్వరంలో షూట్ చేసింది. మరియు లెజెండరీ సైంటిస్ట్ మరియు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పాఠశాలలో కూడా కొన్ని కీలకమైన దృశ్యాలను చిత్రబృందం చిత్రీకరించింది. అయితే స్పేస్ కు సంబంధించిన సినిమా కావ‌డంతో ఇక్క‌డ షూటింగ్ చేశారు అని అంటున్నారు… ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్ పూర్తి అయింది అని తెలుస్తోంది. ఇకపోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లు జ‌రుగ‌నున్నాయి.

Related image

ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి , అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు.. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో మొద‌టిసారి వ‌స్తున్న స్పేస్ సినిమాగా దీనిని చెప్ప‌వ‌చ్చు.