విజయ నిర్మల చివరిసారి కృష్ణతో ఏం మాట్లాడిందో తెలిస్తే కన్నీళ్లాగవు

891

టాలీవుడ్ ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. విజయ నిర్మల పార్థివ దేహాన్ని నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకొచ్చారు.. బంధువులు, అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని రోజు మొత్తం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అనంతరం ఆమె అంతిమయాత్ర చేపట్టి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Image result for vijaya nirmala

తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే విజయనిర్మల మరణం ఎవరికీ ఎలా ఉన్నా సూపర్ స్టార్ కృష్ణకు మాత్రం పెద్ద కష్టమే అని చెప్పుకోవాలి. భార్య మరణాన్ని ఆయన తట్టుకోలేపోతున్నాడు. అసలు విజయనిర్మల లేకుండా కృష్ణ ఎలా ఉంటాడని అందరు అనుకుంటున్నారంటేనే అర్థం చేసుకోండి ఈ ఇద్దరి బంధం ఎంత గొప్పదో. అయితే విజయనిర్మల చనిపోబోయే ముందు కృష్ణతో సంతోషంగా గడిపినట్టు తెలుస్తుంది. తన ఆరోగ్యం క్షీణిస్తుంది అని తెలుసుకునం విజయనిర్మల భర్తతోనే గడిపింది. అయితే ఒకవేళ నేను చనిపోతే పిల్లలను బాగా చూస్కోండి. నా గురించి దిగులు పడకుండా ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. మనువళ్లు మానవరాళ్లతో ఎక్కువగా గడపండి అని చెప్పిందంట. ఆ మాటలకూ కృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నాడంట. ఇదంతా తెలిసి కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారంట. ఏది ఏమైనా విజయ నిర్మల ఇలా కృష్ణను వదిలేసి వెళ్లిపోవడం బాధాకరమే. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి.సినీ ప్రముఖులు విజయ నిర్మల ఇంటికి చేరుకొని నివాళి అర్పిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.