కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్బంగా ప్రిన్స్ ఏం చేశారంటే

432

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తారు… సోష‌ల్ మీడియాలో నిరంతం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ, స‌మ‌స్య‌ల‌పై వెంట‌నే రెస్పాండ్ అవుతారు… ఇక ఈరోజు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్బంగా ఆయ‌న‌కు సినీ, రాజకీయ ప్రముఖులు, ప్రజలు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు.

Image result for ktr images

ఇక భ‌ర‌త్ అనే నేను సినిమాని చూసి ఆ సినిమా గురించి మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి సొసైటి గురించి ప‌లు ముఖ్య‌మైన విష‌యాలు తెలియ‌చేశారు మంత్రి కేటీఆర్.. ఈ స‌మావేశంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు కూడా పాల్గొన్నారు. కేటీఆర్ ప్రిన్స్ మ‌హేష్ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌న కూడా చూసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు.. ఇక‌ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విటర్ ద్వారా కేటీఆర్ కు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. కేటీఆర్, మహేష్‌ల మధ్య మంచి స్నేహం ఉంది. అనేది తెలిసిందే.

Image result for ktr mahesh

 

కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా విషెస్ తెలిపాడు మహేష్. ‘‘మంచి స్నేహితుడు, గొప్ప లీడర్, డైనమిక్ పర్సన్.. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్విటర్ ద్వారా తెలిపాడు మహేష్. కేటీఆర్‌కు బొకేను అందజేస్తున్న పిక్‌ను జత చేశాడు మహేష్. దీంతో ఇటు ఇరువురి అభిమానులు ఇప్పుడు ఈ ఫోటోను వైర‌ల్ చేస్తున్నారు..