అక్కినేని నాగార్జునకు ఏమైంది.. టాలీవుడ్ లో పెద్ద చర్చ

612

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో మన్మధుడుగా పిలిపించుకునే నాగార్జున తన ఫిట్ నెస్ కు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తాడు. తన వయసు పెరుగుతున్నా ఆఛాయలు ఎక్కడా కనపడనీయకుండా నాగార్జున చాల జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు హుషారుగా కనిపిస్తూ యంగ్ హీరోలకు సవాల్ విసరడం నాగార్జున హాబి. ఇక యంగ్ హీరోలు కంటే 50 ఏళ్లుదాటినా వారికంటే నాగ్ లుక్స్ లో బాగా క‌నిపిస్తాడు. ముఖ్యంగా నాగార్జున డైటింగ్ కూడా చాల క్ర‌మంగా ఉంటుంది. ఇక జిమ్ వ‌ర్క్ అవుట్స్ ఇలా ప్ర‌తీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటాడు నాగార్జున అయితే ఇప్పుడు నాగార్జున గురించి అంద‌రూ ఓ విష‌యం పై చ‌ర్చించుకుంటున్నారు మ‌రి అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for nagarjuna

శుక్రవారం జరిగిన తెలంగాణ ఎన్నికలలో ఓటు వేసిన తరువాత ఆయన షేర్ చేసిన ఒక పిక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాగార్జున గారూ.. ఈ ఫొటోను ఎలిమినేట్ చేయండి అంటూ నాగ్ ఫ్యాన్స్ నాగార్జునకు రిక్వెస్ట్ లు పెడుతున్నారు అంటే నిన్నటిరోజున నాగార్జునను చూడగానే అభిమానులు ఎంతగా భయపడిపోయారో అర్ధం అవుతుంది.

Image result for nagarjuna

నిన్న ఓటు వేయడానికి నాగ్ తన భార్య అమలతో కలిసి వచ్చి అందరితో కలిసి క్యూ లైన్ లో నుంచున్నాడు. మిగతా సెలబ్రెటీల్లాగే నాగ్ కూడా ఓటు వేసిన అనంతరం సెల్ఫీ తీసుకుని దాన్ని ట్విట్టర్లో షేర్ చేయడం ద్వారా జనాల్లో చైతన్యం తేవాలని చూశాడు. అయితే ఈ ఫొటోలో నాగ్ ఏమంత బాగా కనిపించలేదు ఏదో సినిమా కోసం గడ్డం పెంచినట్లుగా కనిపిస్తున్నా దానికి సరిగ్గా రంగు లేకపోవడం వల్ల అక్కడక్కడ తెల్లగా కనిపించింది. ఇక ఈ లుక్ లో మన్మ‌ధుడిని చూడ‌లేక‌పోతున్నాం అని అభిమానులు ముఖ్యంగా అమ్మాయిలు కోరుతున్నారు దీనికి తోడు నాగార్జున ఇలాంటి పిక్స్ ఎప్పుడూ పెట్ట‌లేదు అని ప్లీజ్ ఈ పిక్ తీసేయండి అంటూ చెబుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీనికితోడు నాగార్జున ముఖం కూడ ఏమాత్రం ఫ్రెష్ గా లేకుండా చాల నీరసంగా కనిపించింది. ప్రస్తుతం పెరిగిన వయసు ప్రభావం నాగార్జున ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. తనకున్న ఇమేజ్ దృష్ట్యా బయటికి వచ్చేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించే నాగ్ నిన్నటిరోజున ఇంత ఆర్డినరీ లుక్‌తో ఎలా బయటికి వచ్చాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే నాగార్జునకు పెరిగిన వయసు రీత్యా ఈ మధ్య మెయింటైనెన్స్ తగ్గించాడేమో అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మ‌రి ఆయ‌న ఎప్పుడైనా ఎలా ఉన్నా త‌మ‌కు ఇష్ట‌మే అని కొంద‌రు ఫ్యాన్స్ చెబుతున్నారు.మ‌రి చూశారుగా దీనిపై నాగ్ లుక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.