చిరంజీవి,సుమ గురంచి దవదాస్ కనకాల చివరి మాటలు

538

టాలీవుడ్ కోలీవుడ్ లో ఎందరో మేటి దిగ్గజ నటులను తీర్చిదిద్దిన గురువుగా కచ్చితంగా దేవదాస్ కనకాలని చెప్పాలి.. తనకు వచ్చిన నటనను కొత్తదనం చూపే విధంగా ఆనాటి నూతన నటులకు శిక్షణ ఇచ్చారు దేవదాస్ కనకాల. సినిమాలలో నటిస్తూ దర్శకుడిగా ఉంటూ పలువురికి ట్రైనింగ్ ఇఛ్చిన గొప్ప గురువుగా చెప్పాలి. ఇఫ్పుడు సీరియల్స్ సినిమాలు విలన్ రోల్స్ హీరో రోల్స్ చేస్తున్న 70 శాతం మంది టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఆయన దగ్గర నట శిక్షణ తీసుకున్న వారే. కాని అలాంటి లెజండరీ నటుడు గురువు లేరు అంటే ఇప్పటికీ సినిమా ప్రపంచం తట్టుకోలేకపోతోంది.

Image result for chiru

అంతేకాదు దేవదాస్‌ కనకాల భార్య లక్ష్మీదేవి కూడా నటులకు శిక్షణ ఇచ్చేవారు. దేవదాస్‌ కనకాల మరణ వార్త విన్న సినీమా ప్రపంచం తల్లడిల్లిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవదాస్‌ కనకాల కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన 1945 జులై 30న యానాంలో జన్మించారు. దేవదాస్‌ కనకాలకు కుమారుడు రాజీవ్‌ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మి ఉన్నారు. ఇటీవలే దేవదాస్‌ కనకాల భార్య లక్ష్మీదేవి మృతి చెందారు.

Image result for devadas kanakala

విశాఖపట్టణంలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ చదివారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో విద్య అభ్యసించిన తొలితరం తెలుగువారిలో దేవదాస్ ఒకరు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లోను అధ్యాపకునిగా, తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. నట శిక్షణ ఇవ్వడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌ పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే.

ఈ క్రింది వీడియో ని చూడండి

అయితే గతంలో గురువుగారిని చూడటానికి చిరంజీవి మూడు నెలలకు లేదా ఆరునెలలకు ఒకసారి కచ్చితంగా దేవదాస్ కనకాల గారి ఇంటికి వచ్చేవారట. అయితే చిరంజీవి వచ్చారు అనే వార్త తెలియగానే ఆయన అభిమానులు వేల సంఖ్యలో దేవదాస్ కనకాల ఇంటికి చేరుకునేవారు ..దీంతో దేవదాస్ కనకాల భార్య కూడా చిరంజీవితో నేరుగా చెప్పారట ,బాబు చిరంజీవి మాకు నిన్ను చూడాలి అనిపించినా, నీకు మమ్మల్ని చూడాలనిపించినా కబురుపంపితే మేమే నీదగ్గరకు వస్తాం ..ఇక్కడ వేలాది మంది రావడం వల్ల సమస్య వస్తోంది అని అన్నారట. తర్వాత నేరుగా చిరంజీవి ఇంటికి వీరే వెళ్లేవారు .ఇక కుమారుడు రాజీవ్ యాంకర సుమని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఈ సమయంలో నా ఇంటికి కోడలు కాదు, నాకు రెండోవ కూతురు వచ్చింది అని అనేవారట. ఆమె యాంకర్ గా పేరు సంపాదించి లైఫ్ లో ఎదిగింది ఈ సమయంలో ఆయన ఎంతో హ్యాపీ ఫీలయ్యేవారట. నాకు సుమ కోడలు కాదు రెండో కూతురు అని అందరితో చెప్పేవారట.

Image result for suma

అంతేకాదు ఆయనకు రజనీకాంత్ సుధాకర్ రాజేంద్రప్రసాద్ నాజర్ భానుచందర్ ఇలా ఎంత మంది హీరోలు శిష్యులుగా ఉన్నా కేవలం చిరంజీవి నటన మాత్రమే నచ్చేదట. చిరంజీవి కళ్లు చాలు సినిమా హిట్ అవ్వడానికి అనేవారట.. చిరంజీవి డైలాగ్ డ్యాన్స్ యాక్టింగ్ అన్నీ సూపర్ అందుకే చిరంజీవి మంచి హీరో అవుతాడు అని స్టూడెంట్స్ కు చెప్పేవారట. చివరకు చిరంజీవి అంతటి మెగాస్టార్ అయ్యారు, చివరి రోజుల్లో దేవదాస్ ని చిరంజీవి కలిసిన సమయంలో, ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారు నాకు చెప్పండి అని చిరంజీవి అనేవారట, ఆ సమయంలో నాకొడుకు కోడలు నాకు అన్నీ చూసుకుంటున్నారు, సినిమా నటులు నా శిష్యులు అందరూ కూడా నా బాగోగు అడుగుతారు. నాకు ఏమీ అక్కర్లేదు అని దేవదాస్ చెప్పేవారట, ఇక దేవదాస్ కనకాలకు ఇష్టమైన వంటలు స్వీట్స్ ఎప్పుడూ ఆయన ఇంటికి చిరంజీవి వెళ్లినా గురువుగారి కోసం తీసుకువెళ్లేవారట. ఇలా దేవదాస్ కనకాల లేకపోయే సరికి చిరంజీవి కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనకు మనం కూడా అశ్రునివాళి అర్పిద్దాం.