ఈ 10 మంది సినీప్రముఖుల కూతుర్లు ఏం చేస్తున్నారో తెలిస్తే షాక‌వుతారు

481

ఎవ‌రి పిల్లలు అయినా ప్ర‌యోజ‌కులు కావాలి అని, ఏ త‌ల్లి తండ్రి అయినా కోరుకుంటారు.. అలాగే స‌మాజంలో, డాక్టర్ కూతురు డాక్టర్,యాక్టర్ కొడుకు యాక్టర్..అమ్మానాన్న ఐఏఎస్ అయితే వారి పిల్లలు కూడా ఏ కలెక్టరో,ఏ పోలీసాఫీసరో అవుతారు అని అంటాం…అమ్మానాన్న వృత్తులు లేదా ఉద్యోగాలను బట్టే పిల్లలు కూడా ఎక్కువగా ఆయా రంగాల్నే ఎంచుకుంటుంటారు..ఇది రాజకీయాల్లో,సినిమాల్లో ఇంకా ఎక్కువగా కనపడుతుంది.సినిమా రంగంలో అయితే తెరమీద కనపడితే ఆ క్రేజే వేరు..కానీ ఆ క్రేజ్ పట్ల ఎటువంటి ఇంట్రస్ట్ లేకుండా ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ ఎంచుకున్న సినిమారంగంలో వారి వార‌సుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for నారా బ్రాహ్మణి

నారా బ్రాహ్మణి
రాజకీయాలు,సినిమా రంగం రెండు కలగలిసిన కుటుంబం..అందానికి అందం,చదువు బ్రహ్మణి సొంతం..కానీ అటు సినిమాల్ని,ఇటు రాజకీయాల్ని కాదని వ్యాపార రంగాన్ని ఎంచుకుంది బ్రహ్మణి..హెరీటేజ్ లాభాల బాట వెనుక ,హెరిటేజ్ గ్రూప్స్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న ఈమె కృషి ఎంతో ఉంది… దాంతో పాటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యాక్టివిటీస్ కూడా, బాలక్రిష్ణ ముద్దుల కూతురు ,నారా చంద్రబాబు నాయుడు కోడలు అయిన బ్రహ్మణి చూసుకుంటున్నారు.

Related image

మంజుల
సూపర్ స్టార్ క్రిష్ణ కూతురు,ప్రిన్స్ మహేశ్ బాబు సిస్టర్, మంజుల కెరీర్ యాక్టింగ్ నుండే స్టార్ట్ అయింది.కానీ ఆ తర్వా త ప్రొడక్షన్ రంగం వైపు వెళ్లింది…రెండే పాత్రలతో ప్రయోగాత్మక చిత్రం షో ద్వారా మంజుల వెండితెరకు పరిచయం అయింది..ఆ తర్వాత కావ్యాస్ డైరీలో నటించింది.ఆరెంజ్ లో రాంచరణ్ అక్కగా నటించింది…కావ్యాస్ డైరీ,షో ,నాని, ఏం మాయ చేసావే, పోకీరి లాంటి సినిమాలను అందించిన ఇందిరా ప్రొడక్షన్ హౌజ్ ఓనర్ మరెవరో కాదు మంజులనే.

Image result for సుస్మిత కొణిదెల

సుస్మిత కొణిదెల

మెగా కాంపౌండ్ అంటేనే సగం సినిమా స్టార్లు ఉన్న కుటుంబం..అటువంటి కుటుంబం నుండి నిహారికా మినహా సినిమా తెరపై మెరిసిన అమ్మాయిలు లేరు.సుస్మిత మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్ మరియు స్టైలిస్ట్ గా వర్క్ చేస్తున్నారు.ఖైదీ నెం.150,మీ లో ఎవరు కోటిశ్వరుడు ప్రొగ్రాంలో తన తండ్రి చిరంజీవికి స్టైలిష్ట్ గా వర్క్ చేసింది సుస్మితనే.

Image result for పురందేశ్వరి

పురందేశ్వరి
ఐదు భాషల్లో అనర్గలంగా మాట్లాడగలిగే పురందేశ్వరి తండ్రి ఏర్పరిచిన రెండు బాటల్లో ఒక దాన్ని సినిమారంగాన్ని ఎంచుకోకుండా మరొక రంగం రాజకీయాన్ని ఎంచుకుంది.సదరన్ సుష్మాస్వరాజ్ గా పేరు గాంచిన పురందేశ్వరి జెమాలజీ మీద కోర్స్ చేసి హైదరాబాద్ ఇన్ట్సిట్యూట్ జెమ్స్ అండ్ జువెలరీ ని స్థాపించారు…మల్టీటాలెంటెడ్ అయిన పురందేశ్వరి కూచిపూడి నాట్యం కూడా చేయగలరు.

Image result for నాగ సుశీల

నాగ సుశీల
అక్కినేని ఫ్యామిలి కూడా సినిమా రంగంతో విశేషమైన సంభందం కలిగి ఉన్నదే..అటువంటి ఫ్యామిలి నుండి వచ్చిన నాగసుశీల రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టారు.అంతేకాకుండా సినిమా నిర్మాణ రంగంలో కూడా ప్రవేశించారు. కరెంట్,కాలిదాసు,అడ్డా లాంటి సినిమాలను తన కొడుకు సుషాంత్ ని హీరో గా పెట్టి ప్రొడ్యూస్ చేశారు.మరోవైపు అన్నపూర్ణ స్టూడియో బాద్యతలు,అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మీడియా డైరెక్టర్ గా ఆమె ఉన్నారు.

Image result for ఉపాసన

ఉపాసన
సినిమా బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలి నుండి రాకపోయినా సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలిలోకి కోడలుగా అడుగుపెట్టారు ఉపాసన..అపోలో చారిటి కి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఉపాసన. చూశారుగా వీరు సినిమా ఇండ‌స్ట్రీలో లేక‌పోయినా పెద్ద పెద్ద వ్యాపారాల‌తో మ‌రింత పేరు తెచ్చుకున్నారు. వీరు సాధించిన ప్ర‌గ‌తిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.