బరువు తగ్గిన నిత్యామీనన్.. ఫోటో చూసి ఖంగుతింటున్న అభిమానులు

681

నిత్యామీనన్ అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. అంతకుముందే బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో టబుకు చెల్లిగా నటించింది. మోహన్‌లాల్‌తో కూడా ఒక సినిమాలో నటించింది. మాతృభాష మలయాళం. కానీ, వేరే భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి, ఇష్టం ఈమెకి కాస్త ఎక్కువే. అందుకే తొలిసినిమా అలా మొదలైందిలోనే నటనతో పాటు తన గాత్రాన్ని కూడా వినిపించింది. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే.., అబ్బబ్బో.. అబ్బో.. అంటూ పాడిన రెండు పాటలు విజయవంతం అయ్యాయి. తెలుగు సినిమాలతో పాటు, అటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది నిత్య. అక్కడ కూడా పాటలు పాడుతూ ఒక పాటకు నృత్యదర్శకత్వం కూడా చేసింది.

Image result for nithya menon

అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద ఊహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన ఇష్క్ మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. మళ్లీ నితిన్‌తో జతకట్టిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది. జబర్దస్త్, ఒక్కడినే చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. ఏమిటో ఈ మాయ, మాలిని 22 అనే తెలుగు చిత్రాలతో పాటు, రెండు తమిళ సినిమాల్లో కూడా నటించింది. రింగుల జుట్టు.. ఇట్టే ఆకట్టుకునే నటనతో ఫ్యాన్స్‌ను దగ్గర చేసుకున్న నిత్యామీనన్.

ప్రస్తుతం నిత్యామీనన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తీస్తుంది. ఈ సినిమా కోసం నిత్యామీనన్ చాలా బరువు పెరిగింది. అయితే రీసెంట్ గా నిత్యామీనన్ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలలో నిత్యామీనన్ చాలా సన్నగా ఉంది.మొన్నటివరకు చాలా లావుగా ఉన్న నిత్యా గుర్తుపట్టలేనంత సన్నగా మారింది. అంతేకాకుండా ఎప్పుడు చూడని విధంగా చాలా గ్లామర్ గా కనిపించింది. కొత్త సినిమా విషయాల గురించి త్వరలో చెబుతా అని క్యాప్షన్ పెట్టి ఈ ఫోటోలను పోస్ట్ చేసింది.ఇప్పటివరకు లేనంత సన్నగా నిత్యామీనన్ అవ్వడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.సినిమా కోసం సన్నబడండి అంటే నో చెప్పే నిత్యామీనన్ ఇంత సన్నగా అవ్వడం చూసి షాక్ అవుతున్నారు.అయితే ఇంత సన్నగా అయ్యిందంటే ఏదో సినిమా కోసమే అయ్యి ఉంటుంది. మరి అంత ప్రాధాన్యత కలిగిన పాత్ర ఏమి ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ఆ విషయం తెలియాలంటే నిత్యామీననే చెప్పాలి.మరి నిత్యామీనన్ గురించి ఆమె ఇప్పుడు బరువు తగ్గడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.