ఆ ఇద్దరి హీరోల సినిమాలంటే పిచ్చి..వీవీఎస్ లక్ష్మణ్..

404

వీవీఎస్ లక్ష్మణ్…దేశ క్రికెట్ లో ఒక సంచలనం.తెలుగు గడ్డ మీద పుట్టి దేశానికి క్రికెట్ ఆడిన వారిలో చాలా తక్కువ మందిలో ఒకడు.ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ ను డెవలప్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు.అయితే లక్ష్మణ్ క్రికెట్ కు దూరమైన కూడా అభిమానులకు మాత్రం దూరం కాలేదు.సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులను పలకరిస్తూఉంటాడు.

Image result for vvs laxman

ఆస్క్ లక్ష్మణ్ పేరిట నెటిజన్లతో శుక్రవారం ముచ్చటించిన లక్ష్మణ్.. తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు ఎందుకు దక్కడం లేదన్న ప్రశ్నకు బదులిచ్చాడు. జాతీయ స్థాయిలో ఆడగల ప్రతిభావంతులైన ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారు. కానీ టోర్నీలు గెలిచినప్పుడే సరైన గుర్తింపు దక్కుతుందని వీవీఎస్ చెప్పాడు. తను శాకాహారినని చెప్పిన లక్ష్మణ్.. తనకు బిర్యానీ అంటే ఇష్టమని, ప్యారడైజ్ బిర్యానీ అంటే మరింత ఇష్టమని తెలిపాడు.

 

బాలీవుడ్‌లో తన ఫేవరెట్ యాక్టర్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అని వీవీఎస్ చెప్పాడు.మీ ఫేవరెట్ తెలుగు యాక్టర్ ఎవరన్న ప్రశ్నకు లక్ష్మణ్ తనదైన శైలిలో బదులిచ్చారు. తెలుగులో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నారన్న వీవీఎస్.. మహేష్ బాబు, నాని సినిమాలను చూడటాన్ని ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. వీవీఎస్ రిప్లయ్‌తో మహేష్, నాని ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.