వివి వినాయక్ విమాక్స్ థియేటర్ కూల్చివేత.

585

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే పేరు వివి వినాయక్. వివి వినాయక్ కమర్షియల్ చిత్రాలకు మారుపేరు. ఈయనతో సినిమా చెయ్యాలని ప్రతి డైరెక్టర్ కోరుకుంటాడు. ఏ హీరోనూ అయినా మాస్ గా చూపించాలంటే ఈయన తర్వాతనే ఎవరైనా.

Image result for vv vinayak

వివి వినాయక్ దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో థియేటర్ బిజినెస్ ప్రారంభించారు. వైజాగ్ లో పాతబడిని థియేటర్ ని కొనుగోలు చేసి కొనుగోలు చేసి అత్యాధునికమైన హంగులతో రీమోడలింగ్ చేశాడు. ఆ థియేటర్స్ ని విమాక్స్ గా మార్చేశారు. తక్కువ సమయంలోనే విమాక్స్ వైజాగ్ లో బాగా పాపులర్ అయింది. ఇదిలా ఉండగా ఈ థియేటర్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ థియేటర్ త్వరలో కూల్చివేతకు గురికాబడుతున్నట్లు తెలుస్తోంది.

Image result for vv vinayak v max

దీనికి కారణం ఇటీవల వివి వినాయక్ ఆ థియేటర్ ని ఓ కార్పొరేట్ సంస్థకు అమ్మేశారట. విమాక్స్ స్థానంలో భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే థియేటర్ ని కూల్చివేసి పనులు ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. వివి వినాయక్ ఆర్థిక సమస్యలతో ఉండడం వలనే థియేటర్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన సన్నిహితులు దీనిని కొట్టిపారేస్తున్నారు. మంచి రేట్ వచ్చింది కాబట్టే అమ్ముతున్నాడని అంటున్నారు.