విశ్వ‌రూపం 2 విడుద‌ల వాయిదా

349

త‌మిళ‌నాడులో క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం విశ్వ‌రూపం 2 చిత్రం ఈ నెల 10 న విడుద‌ల చేయాల‌ని భావించారు… కాని త‌మిళ రాజ‌కీయ నేత మాజీ సీఎం క‌రుణానిధి మృతితో సినిమా వాయిదా వేసే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది… ఈ విష‌యం పై క‌మ‌ల్ నిర్ణ‌యం ఫైన‌ల్ అని చిత్ర‌యూనిట్ భావిస్తోంది…

Related image

ఆయ‌న సీనియ‌ర్ నేత పైగా కోలీవుడ్ కు చెందిన రాజ‌కీయ శిఖ‌రం.. అందుకే ఈయ‌న సంతాప‌దినాలు పూర్తి అయిన త‌ర్వాత మాత్ర‌మే సినిమా విడుద‌ల చేయాలని భావిస్తున్నారు క‌మ‌ల్.కరుణానిధి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన కమల్‌హాస‌న్ .. ఆ తర్వాత భావోద్వేగమైన సందేశాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే.

Image result for vishwaroopam movie 2

ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని వాయిదా వేసేందుకే కమల్‌ మొగ్గు చూపుతున్నాడట. అందుకే మ‌రో వారం ఆగష్టు 15న చిత్రాన్ని విడుదల చేయాలన్న ఆలోచనలో కమల్‌ ఉన్నట్లు తెలుస్తోంది.. దీనిపై రేపు క‌మ‌ల్ చిత్ర‌యూనిట్ త‌ర‌పున ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తారు అని అంటున్నారు.. కమల్‌ స్వీయ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌తోపాటు, ఆస్కార్‌ ఫిలింస్‌ విశ్వరూపం-2 ను సంయుక్తంగా నిర్మించాయి.