విశాల్ ని పెళ్లాడబోయేది ఈ అమ్మాయే ఆమె అందం ముందు హీరోయిన్లు స‌రిపోరు

370

ఇప్పటి వరకూ నడిగర్ సంఘం భవనం నిర్మించిన తరువాత పెళ్లి చేసుకుంటానన్న హీరో విశాల్ ఆ భవనం నిర్మాణంలో ఉండగానే సడెన్ ట్విస్ట్ ఇచ్చాడు. విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడన్న న్యూస్ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విశాల్ చేసుకోబోయే అమ్మాయిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ విషయమై సస్పెన్స్‌కి తెరదించారు విశాల్ తండ్రి, ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి. తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. విశాల్ పెళ్లి అనిషా అనే అమ్మాయితో జరగనుందని.. త్వరలోనే వారి నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సౌతిండియా స్టార్ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ పెళ్లి వార్తా వినగానే , ఒక్కసారిగా చిత్రసీమ షాక్ అయింది. హీరోయిన్ వరలక్ష్మి, విశాల్‌లు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు వినిపించినా ఆయ‌న తండ్రి చెప్పిన మాట‌తో వీరిద్ద‌రికి ఎటువంటి రిలేష‌న్ లేదు అని క్లారిటీ అయితే వ‌చ్చింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ క్రమంలో విశాల్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు…ఈ సంవత్సరమే విశాల్ పెళ్లి జరగనుందట. విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు అనీషా. . దీంతో అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో కలిగింది. ఇప్పుడు ఆమె ఫోటో బయటకి వచ్చింది. హైదరాబాద్‌కి చెందిన వ్యాపారవేత్త విజయ్ రెడ్డి, పద్మజ దంపతుల కుమార్తె. ఇలా ఇలా ఉండగా.. నడిగర్ సంఘం భవనం పూర్తయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని గతంలో విశాల్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ నాటికి భవనం నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఈలోగా నిశ్చితార్ధం జరిపి పెళ్లి డేట్‌ని ఫైనల్ చేయనున్నారు.మ‌రి విశాల్ కూడా బ్యాచిల‌ర్ గా ఉన్నాడు సినిమా ఇండ‌స్ట్రీలో, ఇక ఆయ‌న కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడు.