విశాల్ న‌న్ను మోసం చేశాడు అందుకే అత‌న్ని చంపేస్తా వర‌ల‌క్ష్మి సంచ‌ల‌న కామెంట్లు

634

త‌మిళ సీనియ‌ర్ హీరో శ‌ర‌త్ కుమార్ వార‌సురాలిగా తెరంగేట్రం చేసిన వ‌ర‌ల‌క్ష్మి అన్ని రకాల పాత్ర‌లనూ పోషిస్తూ మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. హీరో విశాల్‌తో వ‌ర‌ల‌క్ష్మి ప్రేమాయ‌ణం గురించి ఇప్ప‌టికే ఎన్నో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఆ వార్త‌ల‌ను ఇద్ద‌రూ ఖండించారు. ప్ర‌స్తుతం విల‌న్‌గా వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ వ‌ర‌ల‌క్ష్మి దూసుకుపోతోంది.

Image may contain: 1 person, smiling, standing

ఇలాంటి గాసిప్స్ లో నిజం లేద‌ని వాటిల్లో న‌మ్మాల్సింది లేదని చెబుతుంటుంది ఈ జంట. తాజాగా మరోసారి అటువంటి కామెంట్సే చేసింది నటి వరలక్ష్మీ. విశాల్ హీరోగా నటించిన ‘పందెంకోడి2’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకి జంటగా కీర్తి సురేష్ నటించగా.. ప్రతినాయకి పాత్రలో వరలక్ష్మి నటించింది. ఈ పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మీ అద్బుత‌మైన న‌ట‌న న‌టించింది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో.. నటుడు విశాల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని ఆమెని ప్రశ్నించగా.. ఇదే ప్రశ్న ఆయన్ని పలుమార్లు అడిగినట్లు చెప్పింది. ఇలా కాలం గడిచిపోతే ఆ తరువాత పెళ్లి చేసుకుందామన్నా.. ఎవరూ పిల్లని ఇవ్వరని కూడా చెప్పానని వెల్లడించింది. ఇక అప్ప‌టి నుంచి విశాల్ కు ఆమెకు మ‌ధ్య ఏమీ లేదు అనేది క్లారిటీ వ‌చ్చింది తాజాగా మ‌రోసారి ఆమె వివాదాస్పద వ్యాఖ్య‌లు చేసింది.

తాజాగా ఓ అవార్డుల కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వ‌ర‌ల‌క్ష్మి.. వ్యాఖ్యాత అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలిచ్చింది. `ఒక‌రికి ముద్దివ్వాల్సి వ‌స్తే.. ఒక‌రిని చంపాల్సి వ‌స్తే.. ఒక‌రిని పెళ్లి చేసుకోవాల్సి వ‌స్తే.. ఈ మూడు విష‌యాల్లో మీ చాయిస్ ఎవ‌రు?` అని వ‌ర‌ల‌క్ష్మిని వ్యాఖ్యాత ప్ర‌శ్నించారు. ముద్దు పెట్టాల్సి వ‌స్తే హీరో శింబునే ఎంచుకుంటాన‌ని వ‌ర‌ల‌క్ష్మి చెప్పింది. అలాగే చంపాల్సి వ‌స్తే.. అది విశాల్‌నేన‌ని, పెళ్లి చేసుకోవాల్సిన వ్య‌క్తి గురించి త‌న‌కే క్లారిటీ లేద‌ని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఆమె ఎందుకు విశాల్ ని చంపాలి అని అనుకుందో అని అభిమానులు మాత్రం తెగ ఆలోచిస్తున్నారు మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.