వినయ విధేయ రామ ట్రైలర్ ఊర మాస్..

286

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. .డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Image result for vinaya vidheya rama

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేశారు.ఈ వేడుకలో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి తదితరులు హాజరయ్యారు. కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌ను విడుదల చేశారు.

వినయ విధేయ రామ టైటిల్ చాలా సాఫ్ట్‌గా ఉన్నా.. సినిమా ఫుల్ మాస్ అని టీజర్‌లోనే హింట్ ఇచ్చారు దర్శకుడు బోయపాటి శ్రీను. ట్రైలర్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ”సరైన సింహం తగలనంత వరకు ప్రతీ వేటగాడు మగాడే రా.. నాకు నీలా సైన్యం లేదు.. ఒంట్లో బెరుకు లేదు.. చావంటే అస్సలు భయం లేదు.. బై బర్తే డెత్ ని గెలిచొచ్చా..” అంటూ చరణ్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకురానుంది.