వినయ విధేయ రామలో ఆ సీన్స్ కట్

280

రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ చిత్రం భారీ అంచనాలతో వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. రామ్ చరణ్ బోయపాటి కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది.సినిమాలోని సీన్లపై ట్రోలింగ్

ఈ చిత్రంలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టినా కథ పరంగా, సినిమాను తెరకెక్కించిన విధానం పరంగా దర్శకుడు విఫలం అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ చిత్రంలో కొన్ని సీన్లపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతోంది.

Image result for vinaya vidheya rama vivek oberoi

క్లైమాక్స్‌లో విలన్ వివేక్ ఒబెరాయ్ పాముతో ఓ పిల్లాడిని బెదిరించడం, ఆ పాము విలన్‌ను కాటేసి చివరకు అదే చచ్చిపోవడం లాంటి సీన్లతో పాటు ట్రైన్ సీన్, మరికొన్నిఓవర్ లాజిక్ లెస్ సీన్లను తొలగించాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని తొలగించడం ద్వారా ఎంతో కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోందట.