వినయ విధేయ రామ ‘రామ లవ్స్ సీత’ అద్భుతహ

207

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. .డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ నటుడు ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ ముఖ్యపాత్రలు పోషించారు.

Image result for vinaya vidheya rama

ఇప్పటికే విడుదల అయినా చిత్ర ట్రైలర్ సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది.సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్ర రిలీజ్ దగ్గరపడడంతో చిత్ర ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈ చిత్రంలోని ‘రామ లవ్స్ సీత’ వీడియో సాంగ్ ప్రోమోను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ప్రోమోను విడుదలైన గంటలోనే రెండు లక్షల మంది చూశారు.

ఈ పాటలోని చరణ్ డ్యాన్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బాణం స్టెప్ చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రోమోను చూసిన అభిమానులు సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తిని కనబరుస్తున్నారు.