వినయ విధేయ రామ ‘తస్సాదియ్యా’ ఊర మాస్..

262

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. .డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Related image

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్స్ ఫస్ట్ సాంగ్ మంచి క్రేజ్ వచ్చింది.దేవి శ్రీ బాణీల్లో ‘‘తందానే తందానే’’ అంటూ సాగిపోయిన ఫస్ట్ సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు రెండవ సాంగ్ ను విడుదల చేశారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ‘తస్సాదియ్యా’ అనే మాస్ మసాలా సాంగ్‌ను విడుదల చేశారు. దేశీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిచంగా.. జస్ప్రీత్, మానసి ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు.

‘వినయ విధేయ రామ’ ఫస్ట్ సాంగ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసిన బోయపాటి.. ఈ ‘తస్సాదియ్యా’ సాంగ్‌తో మాస్ ఆడియన్స్‌ చేరువయ్చే ప్రయత్నం చేశారు. ఈ లిరికల్ వీడియోలో రామ్ చరణ్ తేజ్ డాన్స్‌తో ఇరగతీస్తున్నాడు ఆకుపచ్చని కురచ గౌనులో కైరా అద్వానీ అందాలను ఆరబోస్తుంది.ఇక ఈ లిరికల్ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి కనిపించడం మరో విశేషం.