‘వినయ విధేయ రామ’ తస్సాదియ్యా సాంగ్

289

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Image result for vinaya vidheya rama

ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే టీజర్, ఫస్ట్ సాంగ్‌లు విడుదల చేయగా.. సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్‌కు ముహూర్తం కుదిరింది. డిసెంబర్ 17 సాయంత్రం 4 గంటలకు ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించింది చిత్ర యూనిట్. ‘తస్సాదియ్యా’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన ప్రమోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

ఫస్ట్ సాంగ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసిన బోయపాటి.. ఈ ‘తస్సాదియ్యా’ సాంగ్‌తో మాస్ ఆడియన్స్‌ మసాలా అందించేందుకు రెడీ అయినట్టు పోస్టర్‌ని బట్టి తెలుస్తోంది. ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే.. రెండు సాంగ్స్ మినహా షూటింగ్ దాదాపు పూర్తైంది. ఈ మిగిలిన రెండు సాంగ్స్‌‌తో పాటు మొత్తం షూటింగ్‌ని డిసెంబర్ 26కి పూర్తి చేసి.. సంక్రాంతి నాడు విడుదల చేస్తున్నట్టు మరో ట్వీట్‌లో పేర్కొన్నారు డీవీవీ నిర్మాణ సంస్థ. ‌